Nivrithi : సెలబ్రిటీలకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ కామన్. ఇక వాళ్ల ఇంట్లో వాళ్లకు అడపాదడపా ఫాలోయింగ్ ఉంటుంది. ఇక టాప్ హీరో పిల్లయితే వాళ్ళ పిక్స్ కి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంటుంది. ఇందులో ముఖ్యంగా మహేష్ కూతురు సితార, అల్లుఅర్జున్ కూతురు అర్హ కి ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. అయితే సితార కి సోషల్ మీడియాలో స్వంత ఖాతాలు ఉన్నాయి, వాటి ద్వారా తన డాన్స్ వీడియోలు తన కుటుంబానికి సంబంధించిన పిక్స్ షేర్ చేస్తూ సుపర్ స్టార్డమ్ వల్ల వచ్చిన ఫాలోయింగ్ ను ఎంజాయ్ చేస్తోంది. ఇక ఇపుడు ఆ జాబితాలోకి మరో సెలబ్రిటి కిడ్ వచ్చింది.

సోషల్ మీడియాలో శ్రీజ కూతురు…
మెగాస్టార్ చిన్న కూతురు శ్రీజ మొదటి వివాహం ఎంత రచ్చయిందో అందరికీ తెలుసు. తన కుటుంబాన్ని ఎదిరించి ప్రేమ వివాహం చేసుకుంది. ఆ తరువాత గొడవలతో వాళ్ళు విడిపోయారు. అయితే వీడిపోయేనాటికి వారికి ఒక పాప ఉంది, ఆ పాప పేరు నివృతి. తాత చిరంజీవి, తల్లి శ్రీజ వద్దే పెరిగిన నివృతి మెగా గ్రాండ్ చైల్డ్ హోదాలో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ఇక ఇపుడు సోషల్ మీడియాలో అడుగుపెట్టి కుటుంబానికి సంబందించిన పిక్స్ షేర్ చేస్తోంది.

ఆగష్టు 15 నాడు స్కూల్ మిస్ అవుతున్నా అంటూ అలాగే వీళ్ళను మిస్ అవుతున్నా అంటూ శ్రీజ, కళ్యాణ్ దేవ్, తన చెల్లి పిక్ షేర్ చేసింది. ఇప్పటికే శ్రీజ, కళ్యాణ్ దేవ్ విడాకులు తీసుకోబోతున్నారు అంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో ఇలా నివృతి పోస్టు చేయడంతో అందరూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే నెటిజన్స్ లో కొందరు యాంటీ ఫ్యాన్స్ బ్యాచ్ ఏమో తెలియదు కానీ వాళ్ళు మాత్రం మీ అమ్మను మించిపోతున్నావ్ అంటూ నివృతి మీద ట్రోల్ చేస్తున్నారు.

































