North korea president Kim daughter : ఒకప్పట్లో నియంత అనగానే హిట్లర్ లాంటివాళ్ళు గుర్తొస్తారు. మరి ఈ కాలంలో నియంతలు ఉన్నారా అంటే నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ ఉన్నాడుగా అంటారు. ఇప్పటి తరానికి నియంత కిమ్ మాత్రమే. నార్త్ కొరియాలో ఏమి జరిగిన అది బయట ప్రపంచానికి తెలియాలంటే కిమ్ అనుమతి కావాల్సిందే. ఇక అక్కడ జరిగేది నచ్చక గొంతెత్తడానికి అక్కడ ప్రతిపక్షం లేదు, నేనే రాజు నేనే మంత్రి అన్నట్లుగా కిమ్ పాలన ఉంటుంది. చివరికి అక్కడి ప్రజలు ఏ హెయిర్ స్టైల్స్ పెట్టుకోవాలో కుడా కిమ్ సారే నిర్ణయిస్తారు. అలాంటి నియంత్రుత్వ పాలన చేస్తున్న కిమ్ ఇప్పుడు ఒక షాకింగ్ పని చేసి వార్తల్లో నిలిచారు.

మొదటి కిమ్ కూతురు మీడియా కంట…
కిమ్ తనను తప్ప తన కుటుంబాన్ని ఎప్పుడూ మీడియాకు చూపించలేదు. కిమ్ భార్య ఎపుడో పుష్కర కాలం కిందట ఒకసారి ఒక జాతీయ కార్యక్రమంలో హాజరై అలా కనిపించి వెళ్ళిపోయింది. కిమ్ కి ఇద్దరు కొడుకులు ఒక కూతరు అని మాత్రమే ప్రపంచానికి తెలుసు. వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ల పేర్లేమిటి ఎవరికీ తెలియదు. అంతఃపురం దాటి ఫ్యామిలీ బయటికి రావడం అరుదు. కిమ్ సారే క్షిపణి పరీక్షలప్పుడో ఏదైనా అగ్ర రాజ్య అధినేత తో మీటింగ్ అప్పుడో తప్ప బయట కనిపించడు, ఇక ఫ్యామిలీ ఏమి కనిపిస్తుంది. అలాంటింది ఈ కిమ్ తన కూతురుని మొదటి సారి మీడియాకు చూపించారు. ఇటీవల హాస్యంగ్ 17 అనే ఖండాంతర క్షిపణి ని పరీక్షించింది నార్త్ కోరియా.

ఆ సమయంలో కిమ్ తో పాటు కూతురు కూడా హాజరయ్యారు. కానీ అక్కడి వారికి ఎవరికీ కిమ్ కూతురు పేరు తెలియదు ఎందుకంటే కిమ్ తన కుటుంబ వివరాలు చాలా గోప్యంగా ఉంచడం వల్ల. అయితే అమెరికాకు చెందిన బాస్కెట్ బాల్ ప్లేయర్ డెన్నిస్ రాడ్మాన్, కిమ్ కి కూతురు ఉందని తన పేరు జూయే అంటూ పాత ఇంటర్వ్యూలో చెప్పడమే తప్ప ఆమె పేరు నిజంగా ఏంటో ఎవరికీ తెలియదు. అయితే జూయే వయసు ప్రస్తుతం 13 సంవత్సరాలు ఉండొచ్చని ఇంకో 5 ఏళ్లకు నార్త్ కోరియా మిలిటరీ లో సేవలు చేయడాని సిద్ధమవుతోందని అందుకే కిమ్ తనను క్షిపణి పరీక్షల్లపుడు బయటికి తీసుకు వచ్చాడని అంటున్నారు.





























