NTR : కళ్యాణ్ రామ్ హీరోగా, నూతన దర్శకుడు మల్లిడి వశిష్ఠ దర్శకత్వం వహించగా ఆగష్టు 5న ప్రేక్షకులకు ముందుకు వచ్చింది ‘బింబిసార’ సినిమా. కళ్యాణ్ రామ్ తన సొంత బ్యానర్లో నిర్మించిన ఈ సినిమా విడుదల అయ్యి ఘన విజయం సాధించింది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన కేథరిన్ థెరిస హీరోయిన్ గా నటించింది. విడుదల అయ్యి మూడు రోజులలోనే బ్రేక్ ఈవెన్ సొంతం చేసుకొని, మూడు రోజుల్లోనే ప్రపంచం వ్యాప్తంగా రూ.29.8 కోట్ల గ్రాస్, అలాగే రూ.18.1 కోట్ల షేర్‌ను కొల్లగొట్టింది. సినిమా ఘన విజయం సాధించడంతో నందమూరి హీరోలు ఆనందంలో ఉన్నారు… ఎన్టీఆర్ పై నెగిటివ్ ట్రోల్స్ రావడంతో అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు.

నందమూరి అసలైన వారసుడు కళ్యాణ్ రామ్… అంటూ పోస్ట్లు…
హరికృష్ణ వారసులుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ల మధ్య మంచి అనుబంధం ఉంది. సమయానుసారంగా ఒకరి మీద ఒకరు వారి ప్రేమను చూపిస్తూనే ఉంటారు. ఎన్టీఆర్ సినిమా విజయం సాదిస్తే కళ్యాణ్ రామ్, కళ్యాణరామ్ సినిమా విజయం సాధిస్తే ఎన్టీఆర్ అభినందించే వారిలో ముందు వరుసలో ఉంటారు. ఇద్దరు అన్నదమ్ములు ఒకరికి ఒకరు మద్దతుగా ఉంటే బింబిసార విజయం తరువాత కొంతమంది అభిమానులు సోషల్ మీడియా వేదికగా నందమూరి అసలు వారసుడు కళ్యాణ్ రామ్ అని పోస్టులు పెడుతున్నారు. దీంతో చర్చలు మొదలవుతున్నాయి.

ఎన్టీఆర్ నందమూరి వారసుడిగా తనని తాను నిరూపించుకుంటూనే ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ తరపున ప్రచార బాధ్యతలు చేబట్టిన సంగతి తెలిసిందే. తరువాత కూడా ప్రత్యక్షంగా రాజకీయాల్లో లేకపోయినా తన మద్దతుగా టీడీపీ కేనని చెప్పడం కూడా జరిగింది. అంతే కాకుండా కళ్యాణ్ రామ్ బింబిసార కోసం ఎంతగా ప్రమోషన్ లో పాల్గొన్నాడో అందరూ చూసారు. అయితే కొంతమంది కావాలనే ఎన్టీఆర్ మీద ట్రోల్స్ చేస్తున్నారని, అభిమానం ముసుగున చేస్తున్నారని, ఎన్టీఆర్ పై వస్తున్న ట్రోల్స్ పై అభిమానులతో పాటు నెటిజన్లు కూడా తప్పుబడుతున్నారు. ఇలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నా తప్పు ఏం లేదు అని కామెంట్లు చేస్తున్నారు.



























