NTR & ANR : తెలుగు సినిమా ఇండస్ట్రీ కి రెండు కళ్ళలాంటి వాళ్ళు ఎన్టీఆర్, ఎన్ఆర్. పౌరాణిక, జానపద సాంఘిక ఇలా అన్ని రకాల సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించి మెప్పించారు. అగ్ర హీరోలుగా వెలిగిన ఈ ఇద్దరి మీద ఒక ఆపవాదు ఇప్పటికీ మనకు వినిపిస్తూ ఉంది. అదే ఈ ఇద్దరు హీరోలు కొత్త వారిని సినిమా అవకాశాలు రాకుండా తొక్కేసారు. అలా హరినాథ్ కు అవకాశాలు లేకుండా చేసారు అంటూ ఇప్పటికీ చెప్పుకుంటారు. కానీ అసలు జరిగింది ఏమిటో ఎవరికీ తెలియదు. అయితే ఈ విషయం గురించి క్లారిటీ గా విశ్లేషణ అందించారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు.

హరినాథ్ గారిని ఎవరూ తొక్కేయ్యలేదు… ఆయనది స్వయంకృపరాధం…
సినిమాల్లో అప్పటికే అగ్రహీరోగా ఉన్న ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఇద్దరూ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇక అలాంటి సమయంలో హరినాథ్ గారు హీరోగా ఎంట్రీ ఇచ్చారు. నిజానికి చాలా సినిమాలకు హీరోగా హరినాథ్ గారిని రిఫర్ చేసింది రామారావు గారే. ఆయనను పెట్టుకుంటే బడ్జెట్ వర్క్ అవుట్ కాదు అనుకున్న సినిమాలకు హరినాథ్ గారి పేరును సిఫార్సు చేసేవారట ఎన్టీఆర్ గారు. ఇక ‘సీతారామ కళ్యాణం’ సినిమాను సొంతంగా చేస్తున్నపుడు రావణుడిగా ఎన్టీఆర్ నటించాలని భావించి రాముడిగా హరినాథ్ గారిని తీసుకుని మంచి వేషం ఆయనకు ఇప్పించారు. ఇక ఏఎన్ఆర్ కూడా ఆయన సినిమాలకు చక్కటి ప్రణాళిక వేసుకుని నటించారే కానీ ఇతరుల జోలికి వెళ్ళలేదు. ఇంకొకరిని తొక్కాల్సిన అవసరం ఆ ఇద్దరు అగ్ర నటులకు ఆ రోజుల్లో లేదు. ఇక్కడ హరినాథ్ గారిది స్వయకృపరాధం అంటూ భరద్వాజ గారు చెప్పారు. అయన తాగుడుకు బానిస అవ్వడం వల్ల ఆయన సినిమా అవకాశాలను కోల్పోయారు. షూటింగులకు తాగి రావడం వల్ల హీరోయిన్లు ఇబ్బందిపడేవారట.

చాలా సార్లు పాటల షూటింగ్స్ లో తడబడటం, తూలడం హీరోయిన్ మీదకు పడిపోవడం వంటివి జరిగిన అనుభవాలను జమున, గీతాంజలి వంటి హీరోయిన్లు చాలా ఇంటర్వ్యూల్లో కూడా పంచుకున్నారు. అలా హరినాథ్ గారిని ఎవరూ తొక్కేయ్యలేదు కేవలం అయన వ్యసనాల కారణంగా ఆయనే అవశాలను కోల్పోయారు. ఆ లోటును కొంతకాలానికి శోభన్ బాబు, కృష్ణ భర్తీ చేసారు అంటూ చెప్పారు భరద్వాజ్ గారు. హరినాథ్ తో చేయాలనుకున్న చాలా సినిమాలను ఆరోజుల్లో అయన తాగుడు చూసి శోభన్ బాబు ని ఎంపిక చేసుకున్న సందర్భాలు ఉన్నాయని చెప్పారు.

































