Featured

NTR Family: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎన్టీఆర్ ఫ్యామిలీ… ఫోటోలు వైరల్!

NTR Family: ఎన్టీఆర్ కుటుంబం ఎక్కువగా మనకు బయట కనిపించరు. ఏదైనా కుటుంబ కార్యక్రమాలలో భాగంగా బయట కనిపించే ఎన్టీఆర్ ఫ్యామిలీ తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఎన్టీఆర్ మినహా మిగిలిన కుటుంబ సభ్యులు మొత్తం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం RRR సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు.

NTR Family: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎన్టీఆర్ ఫ్యామిలీ… ఫోటోలు వైరల్!

ఈ క్రమంలోని ఎన్టీఆర్ తల్లి, సతీమణి, పిల్లలు స్వామివారిని మంగళవారం ఉదయం విఐపి బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్నారు.స్వామి వారి ఆలయానికి ఎన్టీఆర్ కుటుంబం చేరుకోవడంతో ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి వీరికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు.

NTR Family: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎన్టీఆర్ ఫ్యామిలీ… ఫోటోలు వైరల్!

స్వామివారి దర్శనం అనంతరం ఎన్టీఆర్ ఫ్యామిలీ మీడియా కంట పడటంతో క్షణాల్లో ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఎన్టీఆర్ సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉండటం వల్ల స్వామివారి దర్శనానికి రాలేకపోయారని తెలుస్తుంది. ఇకపోతే ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎన్టీఆర్ కుమారులు ఇద్దరు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.

సంతోషంలో తారక్ అభిమానులు….

సాధారణంగా ఎన్టీఆర్ తన పిల్లలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో చాలా తక్కువగా షేర్ చేస్తారు. కాని వీరి ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తే మాత్రం ఆ ఫోటో క్షణాలలో వైరల్ అవుతాయి. అయితే చాలా కాలం తర్వాత ఎన్టీఆర్ సతీమణి పిల్లలు ఇలా మీడియా కంట పడటంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. ఇలా తమ అభిమాన నటుడి పిల్లలను చూడటంతో ఎన్టీఆర్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ అభిమానులు ఆయన నటించిన RRR ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఈనెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరిక.!

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…

1 day ago

విజయ్-సంగీత కలిసి ఉంటున్నారా? కోలీవుడ్‌లో కొత్త చర్చ..

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…

1 day ago

ఒకడే కాదు.. తమ్ముడు కూడా టాప్ క్లాస్! సూర్యవంశీ కుటుంబంలో మరో క్రికెట్ స్టార్..

భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…

1 day ago

రూ.30 వేల అప్పు కోసం దారుణం.. స్నేహితుడినే హత్య చేసిన ఇద్దరు యువకులు..

నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…

1 day ago

ఎలాన్ మస్క్ సంపద ఎంత తెలుసా?.. ప్రపంచ జనాభాకు పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది?ఆశ్చర్యపరిచే లెక్కలు ఇవే!

ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…

1 day ago

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్..జరిమానా విధించిన న్యాయస్థానం..

హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…

1 day ago