NTR : నందమూరి ఇంటి వారసుడిగా తాత, బాబాయ్ ల పేరును నిలబెడుతూ తెలుగు సినిమా లో టాప్ హీరోగా దూసుకుపోతున్న తారక్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమరం భీమ్ పాత్రతో తెలుగు ప్రేక్షకులనే కాకుండా ఇండియా మొత్తం అందరిని తన నటనతో ఆకట్టుకున్నాడు. ఎన్టీఆర్ తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అంటే సింహాద్రి సినిమా. ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన ఆ సినిమా బాక్స్ ఆఫీస్ బద్ధలుకొట్టింది.

రమ్య కృష్ణ కు సారీ చెప్పిన ఎన్టీఆర్…
ఇక రాజమౌళి ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన స్టూడెంట్ నెంబర్ 1 సినిమా హిట్ తరువాత వాళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా సింహాద్రి. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ లో రమ్యకృష్ణతో చిందులేసాడు చిన్న ఎన్టీఆర్. ఇక డాన్స్ చేసేటపుడు రమ్య కృష్ణను తాకాల్సి వచ్చినపుడు ఇబ్బంది పడ్డాడట ఎన్టీఆర్. ఆమె తనకంటే సీనియర్ హీరోయిన్, అది కాక వయసులోనూ పెద్దది దీంతో ఇబ్బంది పడ్డాడట. ఇక సాంగ్ అయ్యాక రమ్య కృష్ణ వద్దకు వెళ్లి డాన్స్ చేసేటపుడు తాకినందుకు సారీ చెప్పాడట.

అయితే రమ్యకృష్ణ తారక్ అలా సారీ చెప్పడంతో షాక్ అయిందట. ఇదంతా కేవలం నటన, పాటలో తాకాల్సి వస్తుంది అందులో తప్పు లేదు అని చెప్పిందట. ఇక తన ఎనర్జెటిక్ డాన్స్ వల్ల పోటీ పడి డాన్స్ చేయడం ఆనందాన్ని ఇచ్చిందని చెప్పిందట. ఇక తారక్ కు మహిళల పట్ల ఉన్న గౌరవ భావానికి, చిన్న వయసులోనే తన మేచూరిటికి ఆశ్చర్యపోయిందట.



































