Nuvve nuvve @ 20 years : మాటల మాంత్రికుడి క్యూట్ లవ్ స్టోరీకి ఇరవై ఏళ్ళు… స్టేజి పైనే తరుణ్ కి ముద్దు పెట్టిన శ్రీయ…!

0
211

Nuvve nuvve @ 20 years : ఏ చోటా ఉన్నా… ఈ పాట వినగానే ‘నువ్వే నువ్వే’ సినిమా అందరికీ గుర్తు వస్తుంది. ఆ సినిమాలోని ప్రతి పాట మంచి హిట్ అయితే హీరోయిన్ ఏడుస్తూ పాడే ఈ క్లైమాక్స్ పాటకి మాత్రం సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఇక ఈ సినిమాలోని ప్రతి సీన్ కూడా ఎక్కడా బోర్ కొట్టించవు. ఇక సునీల్, తరుణ్ కాలేజీ కామెడీ, ఎంఎస్ నారాయణ అన్నవరం కామెడీ మరచిపోలేము. ఈ సినిమా వచ్చి ఇప్పటికి ఇరవై ఏళ్ళు. అయినా మరో ఇరవై ఏళ్ళు దాటినా ఈ సినిమా బోర్ కొట్టదు. ఈ సినిమా లో డైలాగ్ లాగా అమ్మ, అవకాయ్, అంజలి… ఈ సినిమా అస్సలు బోర్ కొట్టవు. మాటల మాంత్రికుడి డైలాగులు, తరుణ్, శ్రీయ, ప్రకాష్ రాజ్, సునీల్ నటన సినిమాను మరో రేంజ్ కి తీసుకెల్లాయి. అలాంటి ఈ సినిమా ఇరవై ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్బంగా వేడుక నిర్వహించారు ఈ చిత్ర యూనిట్.

తరుణ్ కి ముద్దు పెట్టిన శ్రీయ…

ఇక ఈ వేడుకకు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాత రవి కిషోర్, హీరో తరుణ్, హీరోయిన్ శ్రీయ, ప్రకాష్ రాజ్ ఇలా అందరూ హాజరయ్యారు. ఇక హీరోయిన్ శ్రీయ మాట్లాడుతూ ఈ సినిమా కథ చెప్పడానికి త్రివిక్రమ్, రవి కిషోర్ గారు ఢిల్లీ వచ్చారు. కథ వినగానే నచ్చి ఓకే చేసాను అని చెప్పి షూటింగ్ మొత్తం ఎంజాయ్ చేశాను తరుణ్ చాలా ఫ్రెండ్లీ గా ఉంటాడు అంటూ చెప్పింది.

ఈ సినిమా ఒక మధుర జ్ఞాపకం అంటూ చెప్పింది. ఇక తరుణ్ మాట్లాడుతూ శ్రీయ ఏం మారలేదు అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది కాకపోతే పెళ్లయింది. ఒక పాప ఉంది అంతే అనగానే ఒక్కసారిగా శ్రీయ పెద్దగా నవ్వింది. అందరూ చూస్తుండగానే తన కో స్టార్ తరుణ్ ను ముద్దు పెట్టుకుంది. ఇక దీనికి సంబందించిన వీడియో వైరల్ అయింది.