Oppenheimer film controversy : భగవద్గీత అంటే అంత లోకువా?? ఒప్పెన్హైమర్ సినిమా మీద గుర్రుగా ఉన్న జనాలు…!

0
103

Oppenheimer film controversy : ఈ మధ్య కాలంలో మనోభావాల ట్రెండ్ నడుస్తోంది. సంస్కృతి లేక మతం ఏదైనా సరే ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తున్నా లేక ఒక మతంలోని లోపాలను చూపిస్తేనో సదరు వర్గానికి చెందినవారు ఆ సినిమాను నిషేదించాలంటూ ఆందోళన చేస్తారు. సోషల్ మీడియా యుగంలో ఈ ట్రెండ్ మరింత ఎక్కువైంది. హాలీవుడ్ సినిమా అయిన ఒప్పెన్హైమర్ సినిమా విషయంలో తాజాగా ఇదే జరిగింది. ఇండియన్స్ ఈ సినిమా విషయంలో గుర్రుగా ఉన్నారు.

భగవద్గీతను కించపరుస్తారా…

అటామిక్ బాంబును కనిపెట్టిన ఒప్పెన్హైమర్ జీవితం ఆధారంగా తెరకేక్కిన చిత్రం ఒప్పెన్హైమర్. హాలీవుడ్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలాన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ఈ సినిమా కోసం భారతీయ ప్రేక్షకులు కూడా బాగా ఎదురుచూశారు. మరీ ముఖ్యంగా ఈ సినిమా ప్రొమోషన్స్ అపుడు ఒప్పెన్హైమర్ భగవద్గీతలోని శ్లోకాలను చదివారనే విషయం ఇండియన్స్ ను ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో హీరో కూడా భగవద్గీత గురించి తెలుసుకున్నాడనే విషయం కూడా చెప్పడంతో ఒకరకంగా ఈ సినిమా మీద ఇండియన్ మార్కెట్ లో హైప్ క్రియేట్ చేసింది.

అయితే సినిమాలో ఒక ఇంటిమేట్ సన్నివేశాంలో హీరో హిందువులు పవిత్రంగా భావించే భగవద్గీత శ్లోకాన్ని చెప్పడం రుచించడం లేదు. భగవద్గీతను కించపరుస్తారా అంటూ కొన్ని హిందూత్వ సంఘాలు ఏకంగా సినిమాను ఇండియాలో బ్యాన్ చేయాలంటూ కోరగా మరికొంత మంది ఆ సీన్ ను సినిమాలో తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.