osh Ravi : విశ్వనాథ్ గారిని చివరగా మోసాను… నాగార్జున గారు పిలిచి ఏఎన్ఆర్ గారికి పరిచయం చేస్తే ఆయన ఎమన్నారంటే…: నటుడు జోష్ రవి

0
31

Josh Ravi : జబర్దస్త్ నుండి వచ్చి కమెడియన్ గా మంచి ఫేమ్ తెచ్చుకున్న జోష్ రవి జబర్దస్త్ కంటే ముందు నాగచైతన్య జోష్ సినిమాలో ఇండస్ట్రీ లో గుర్తింవు తెచ్చుకున్నాడు. చాలా సినిమాల్లో కమెడియన్ గా తనకంటూ మాంచి గుర్తింపు తెచ్చుకుంటూ ముందుకు వెళ్తున్న రవి గుండె జారీ గల్లంతయ్యిందే సినిమాలో కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు . ఇక చిరంజీవి గారంటే ఎంతో ఇష్టపడే రవి చిరంజీవి కోసం మాత్రమే ఇండస్ట్రీ కి వచ్చానంటూ చెప్తుంటాడు.

విశ్వనాధ్ గారితో అనుబంధం…. ఏఎన్ఆర్ ఎమన్నారంటే….

విశ్వనాధ్ గారితో కలిసి హైవర్ సినిమాలో నటించే అదృష్టం లభించిందంటూ జోష్ రవి చెప్తారు. ఆయన చేతుల మీదుగా పలు అవార్డ్స్ అందుకోవడం వల్ల ఆయనతో కొంత అనుబంధం ఉందని చెప్పారు. ఆయన మరణించినపుడు చివరిసారిగా ఒకసారి చూడటం కోసం వెళితే అక్కడ ఆయన దేహాన్ని కిందకు తీసుకువస్తు అనుకోకుండా నన్ను పిలిచారు. దీంతో నేను ఆయనను నా రెండు చేతులతో మోసాను. ఆయన తల నా మీదకు వాలింది.

ఆయనను మోసే అదృష్టం నాకు కలిగిందని అనిపించింది. శివ స్వరూపం ఆయన అంటూ చెప్పారు జోష్ రవి. ఇక నాగ చైతన్య తో కలిసి జోష్ సినిమా నుండి శైలజ రెడ్డి అల్లుడు వరకు పలు సినిమాలలో నటించడం వల్ల నాగార్జున గారికి నేను తెలుసు. ఒకసారి మనం షూటింగ్ టైం లో వెళితే నాగార్జున గారు ఎక్కడో నిల్చొని ఉంటే నన్ను పిలిచి నాగేశ్వరావు గారికి పరిచయం చేసారు. అప్పటికే ఆయన ఆరోగ్యం బాగోలేక పోవడం వల్ల ఆయన ఊరికే సైగ చేసారు ఇలా పెద్ద పెద్ద లెజెండ్రి నటులతో నాకున్నా చిన్న చిన్న సంఘటనలు నాకు ఎంతో తృప్తిని ఇస్తాయి అంటూ చెప్పారు జోష్ రవి.