Junior NTR: దేశవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ ట్రిపుల్ ఆర్. దర్శకధీరుడు రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కాంబినేషన్ లో వస్తున్న ట్రిపుల్ ఆర్ కోసం దేశవ్యాప్తంగా ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. బాహుబలి హిట్ తరువాత అంతేస్థాయిలో ట్రిపుల్ ఆర్ తెరకెక్కడంతో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

చారిత్రక కథాంశంతో వస్తున్న ఈ మూవీలో రామ్ చరణ్ తేజ్ అల్లూరి సీతారామరాజుగా చేస్తుండగా… ఎన్టీఆర్ కోమురభీంగా కనబడనున్నారు. బాలీవుడ్ యాక్టర్ అజయ్ దేవ్ గన్ కీలక పాత్ర పోషిస్తుండగా.. అలియాభట్ చరణ్ కు జోడీగా కనబడనుంది. దాదాపు 450 కోట్ల రూపాయలతో సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రమోషన్లలో హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి బిజీగా ఉన్నారు.

సౌత్ తో పాటు నార్త్ లో ప్రమోషన్లను నిర్వహించారు. ఇప్పటికే బెంగళూర్, హైదరాబాద్, కొచ్చి, చెన్నై, ముంబై లలో ట్రిపుల్ ఆర్ యూనిట్ సందడి చేసింది. జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యేందుకు మూవీ సిద్ధమైంది. అయితే తాజాగా ఎన్టీఆర్ ఇచ్చిన ఇంటర్య్వూలో మల్టీ స్టారర్ చిత్రాలపై స్పందించారు.
మా కుటుంబాల మధ్య 35 ఏళ్లుగా పోరు నడుస్తోంది.. ఎన్టీఆర్..
ఈ విషయం ఇప్పుడు చెప్పొచ్చో లేదో తెలియదు కానీ.. మా రెండు కుటుంబాల మధ్య గత 35 ఏళ్లుగా పోరు నడుస్తోందని అన్నారు. అయితే ఇది మా మధ్య ఎప్పుడూ పాజిటివ్ గానే ఉందని చెప్పు కొచ్చారు ఎన్టీఆర్. అయినా రామ్ చరణ్ నేను మంచి స్నేహితులం అని బదులిచ్చాడు. ట్రిపుల్ ఆర్ తర్వాత దేశంలోని టాప్ స్టార్స్ ఒకేతాటి మీదకు వస్తారని.. భవిష్యత్తులో మల్టీ స్టారర్ చిత్రాలు వస్తాయని వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారాయి.





























