Paakija : : తమిళ నటి వాసుకి అంటే ఎవరూ గుర్తు పట్టకపోవచ్చు కానీ తెలుగులో పాకీజా అంటే మాత్రం అందరూ గుర్తుపడతారు. బ్రహ్మానందం, పాకీజా కామెడి 90 దశకంలో వచ్చిన ఎన్నో సినిమాలలో సూపర్ హిట్ అయింది. తెలుగులో దాదాపు 100 కి పైగా సినిమాల్లో నటించిన పాకీజా సినిమా అవకాశాలు తగ్గాక తెలుగు తెరకు దూరమైంది, దాదాపు కనిపించలేదు. అయితే చాలా కాలం తరువాత చెన్నై లో తెలుగు మీడియా ప్రతినిధికి కనిపించిన పాకీజా ప్రస్తుతం ఆమె ఆర్థిక ఇబ్బందులతో తిండి గడవడం కూడా కష్టంగా మారి ఇబ్బందులు పడుతున్నారు.

భర్త తాగి కొట్టేవాడు…
సుమారు రెండువందలకు పైగా సినిమాల్లో నటించిన పాకీజా నేడు తినడానికి తిండి లేక అవస్థలు పడుతున్నారు. సినిమాల్లో బిజీ ఆర్టిస్ట్ గా ఉన్న సమయంలో అందరూ చుట్టూ ఉన్నారని, అవకాశాలు లేక డబ్బు లేకపోయే సరికి అందరూ వదిలేసారని బాధపడ్డారు. తల్లికి క్యాన్సర్ రావడంతో చికిత్స కోసం చాలా డబ్బు ఖర్చు పెట్టడం వల్ల బాగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నాను అంటూ పాకీజా తెలిపారు. ప్రేమించి పెళ్లి చేసుకుంటే భర్త కొద్ది రోజులు బాగా ఉండేవాడు. అయితే సంవత్సరం తరువాత అనుమానంతో రోజూ తాగి కొట్టేవాడు అంటూ సంపాదించిన డబ్బు, ఉన్న బంగారం మొత్తం భర్త ఖర్చు చేసేసాడంటూ తెలిపారు.

చివరికి తాగే మందులోనే విషం కలుపుకుని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. చెల్లి పెళ్లి కూడా నేనే చేసినా ఇప్పుడు ఎవరూ నన్ను పట్టించుకునేవారు లేరు అంటూ తెలిపారు. షుగర్ వ్యాధి రావడంతో గర్భాశయం తీసేసారంటూ తెలిపిన వాసుకి గారికి పిల్లలు లేరు. ప్రస్తుతం ఒంటరిగా ఒక పూట తింటే మరోపూట గడవడం కష్టంగా ఉంటూ చిరిగిన బట్టలతో బ్రతుకుతున్నారు. తెలుగులో ఏవైనా అవకాశాలు వస్తే చేస్తానంటూ చెబుతున్నారు. పాకీజా గారికి తెలుగులో బోరింగ్ పాప గా సుపరిచితురలైన జయలలిత మంచి స్నేహాతురాలంటూ తెలిపారు.



























