Parusuram: దర్శకుడు పరశురామ్ నిఖిల్ హీరో గా వచ్చిన యువత సినిమా ద్వారా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తన ప్రస్థానం మొదలు పెట్టాడు. మొదటి సినిమాతోనే ఒక డీసెంట్ హిట్ ని తన ఖాతాలో వేసుకుని మంచి దర్శకుడిగా పేరు సంపాదించుకున్నాడు. మొదటి సినిమా మంచి టాక్ తెచ్చుకోవడంతో తర్వాత రవితేజతో ఆంజనేయులు సినిమాని తెరకెక్కించె ఛాన్స్ కొట్టేసాడు. కానీ ఈ సినిమా నిరాశ పరిచింది. ఈ సినిమాలోని కొన్ని డైలాగ్స్ వల్ల సినిమా హిట్ అవ్వలేదు అన్న వార్తలు ఉన్నాయి. కానీ తర్వాత నారా రోహిత్ హీరోగా సోలో సినిమాని తీయగా అది మంచి విజయాన్ని సాధించింది. కానీ వెంటనే మరోసారి రవితేజ హీరోగా సారొచ్చారు సినిమాతో మరొకసారి పరాజయాన్ని చూడాల్సి వచ్చింది. అందులోనూ సారొచ్చారు సినిమాతో నిర్మాతలకు భారీ నష్టాలు వచ్చాయి.

ఒకరకంగా సారొచ్చారు సినిమా తర్వాత వేరే సినిమాసలు చేయక గ్యాప్ తరువాత, పరుశురామ్ కెరీర్ ఆల్మోస్ట్ ముగిసింది అనుకున్న తరుణంలో శ్రీరస్తు శుభమస్తు సినిమా చేసారు. ఇది పరుశురామ్ కెరీర్ మళ్ళీ గాడి లో పెట్టింది అనే అనాలి. ఇక తరువాత విజయ్ దేవరకొండ హీరో గా వచ్చిన గీత గోవిందం సినిమా ఇక వెనకకు తిరిగి చూసుకునే పని లేకుండా కెరీర్ ముందుకు నడిపేలా చేసింది. 8 కోట్ల రూపాయలతో తీసిన గీత గోవిందం నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చిపెట్టింది అనే చెప్పాలి.దీంతో ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఆఫర్ కొట్టేసాడు.
స్టార్ హీరోల సినిమాల తో తడబాటు…..

అయితే మహేష్ బాబు హీరోగా సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పరుశురామ్, అభిమానుల అంచనాలను అందుకోలేకపోయాడు. ఈ సినిమా నిరాశ పరచడం తో స్టార్ హీరో ల సినిమాలని సరిగా తీయలేడు అని కామెంట్లను ఫేస్ చేస్తున్నాడు. కానీ పరుశురామ్ రికార్డు చూస్తే తాను దర్శకత్వం వహించిన స్టార్ హీరోలు రవితేజ, మహేష్, ఇద్దరి సినిమాలు అంచనాలను అందుకోలేక పోయాయి. బడా హీరో ల సినిమాసలు అంటే బలమైన కథ, కంటెంట్ ఉండాలి కానీ పరుశురామ్ స్టార్ హీరో ల సినిమాలలో ఈ విషయం లో తడబడుతున్నాడు.


































