Parvathesham : పలాస నుండి సినిమా అవకాశాల కోసం హైదరాబాద్ వచ్చి ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న పార్వతీశం తన కష్టాలను గురించి ఇంటర్వ్యూలలో పంచుకున్నారు. ‘కేరింత’ సినిమా అవకాశం తో తెలుగు ప్రేక్షకుల దగ్గర గుర్తింపు తెచ్చుకున్న పార్వతీశం చదువుయ్యాక ఉద్యోగం చేసుకోకుండా సినిమాలలో నటించాలానే కలతో ఇండస్ట్రీ లోకి వచ్చారు. ఇక శేఖర్ ఖమ్ముల సినిమా లో ఛాన్స్ కోసం చేసిన స్ట్రగల్ గురించి తెలిపాడు.

ఫ్రీ భోజనం చేసే వాడిని…
అవకాశాల కోసం ఇండస్ట్రీలో తిరుగుతున్న సమయంలో తినడానికి డబ్బులు ఉండేవి కాదు. స్నేహితులు ఎప్పుడూ సహాయం చేసే వాళ్ళు అయితే తినడానికి ఇబ్బందులు ఉన్నపుడు ఇస్కాన్ గుడిలో ప్రవచనాలు చెప్పి ఫ్రీగా అన్నం పెడతారు అలా 21 రోజులు అన్నం తిన్నాను. ఇక గాంధీ హాస్పిటల్ దగ్గర డాక్టర్స్ కి ఫ్రీ గా అన్నం పెడతారు. మా రూమ్ దగ్గర చాలా మంది డాక్టర్స్ ఉండేవాళ్ళు వాళ్ళతో కలిసి అక్కడికి వెళ్లిపోయేవాడిని దీంతో నన్ను డాక్టర్ అనుకుని అన్నం పెట్టేవాళ్ళు. రెండు పూటలకు సరిపడా తినేవాడిని అలా చాలా రోజులు గడిపాను అంటూ పార్వతీశం చెప్పారు.

శేఖర్ ఖమ్ముల కొత్త వాళ్లకు అవకాశం ఇస్తాడని ఆయన ఉండే దగ్గర రూమ్ రెంట్ కి తీసుకుని ఏడాదికి పైగా అక్కడే ఉన్నాను, అయితే రూమ్ రెంట్ మాత్రం నా స్నేహితుడు కట్టేవాడు అంటూ చెప్పారు. ఇక కేరింత సినిమాలో అవకాశంతో లైఫ్ చేంజ్ అయిందని చెప్పాడు. అయితే మళ్ళీ సాయి కిరణ్ అడవి అడగడం తన నెక్స్ట్ ఫిల్మ్ ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ సినిమాలో నటించానని అయితే అందులో పాత్ర నిడివి తక్కువగా ఉన్నా డైరెక్టర్ కోసం ఒప్పుకున్నానని చెప్పాడు పార్వతీశం. స్క్రిప్ట్ చెప్పినపుడు చాలా బాగా అనిపించి ఒప్పుకున్న సినిమాల్లో తీరా షూటింగ్ అప్పుడు పాత్ర నిడివి తక్కువ ఉండటం అసలు స్క్రిప్ట్ చెప్పిన దాంట్లో పొంతన లేకపోవడం వంటివి ఉన్నాయని కానీ సెట్ కి వెళ్ళాక వద్దని చెప్పలేక కొన్ని సినిమాలు చేసానని చెప్పారు. ఇక ఆ తరువాత చేసిన రెండు సినిమాలు కూడా కేవలం అవకాశాన్ని చేజార్చుకోరాదనే ఉద్దేశంతో వచ్చినవి చేసానని, డబ్బుకు కొంచెం ఇబ్బందిగా ఉంటే చేసినవే తప్ప నచ్చి చేసినవి కాదని వివరించారు.

































