Pavan kalyan : అంటే సుందరానికి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న ఘనంగా జరిగింది. ఈ వేడుకకు పవన్ కళ్యాణ్, సుకుమార్, హరీష్ శంకర్ వంటి ప్రముఖులు హాజరయ్యారు. నాని నటించిన ఈ సినిమా జూన్ 10 శుక్రవారం విడుదల అయింది. ఇక సినిమా పాజిటివ్ టాక్ తో నడుస్తోంది. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జరిగిన ఒక సంఘటన పవన్ కళ్యాణ్ తోటి నటీనటులకు ఎలా గౌరవం ఇస్తాడో మరో సారి చూపించింది .

సినిమా గురించి మాట్లాడుతూ నాని నటనను మెచ్చుకున్నారు. ఇక సినిమా మంచి విజయం సాధించాలని కోరుకున్నారు. నాని కి మా ఇంట్లో చాలా మంది అభిమానులు ఉన్నారని చెప్పారు. కార్యక్రమం ముగించుకుని వేదిక నుండి వెళ్లిపోయే సమయంలో మరోసారి మైక్ అడిగి తీసుకున్నారు. అంతకు ముందే హీరోయిన్ నాజ్రియా, నీవేదా, నదియా లను పలకరించిన పవన్ మైక్ అందుకుని నీవేదాకు క్షమాపణలు తెలిపారు. సినిమా గురించి స్పీచ్ ఇచ్చేటపుడు తనను మరచి పోయినందుకు గాను నీవేదాకు సారీ చెప్పారు. తాను మంచి నటి అంటూ ప్రశంసించారు.

ఇక పవర్ స్టార్ సారీ చెప్పడంతో ఒక్కసారిగా షాక్కిగురైన నీవేదా ఎమోషనల్ అయ్యారు. పవన్ వంటి గొప్ప వ్యక్తి సారీ చెప్పడంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నీవేదా పవర్ స్టార్ ని ఉద్దేశించి ఎంతమంది స్టార్స్ ఉన్నా వన్ అండ్ ఓన్లీ పవర్ స్టార్ అంటూ తన అభిమానాన్ని చాటుకుంది. నీవేదా థామస్, పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాలో కలిసి నటించింది. ఇక ఈ సంఘటనకు పవన్ అభిమానులు మాత్రం ఆయన హుందాతనానికి గర్వంగా కాలర్ ఎగరేస్తున్నారు.



























