Pavan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, తెలుగులో ఏ హీరోకి లేని ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఆయన సొంతం. నిజానికి ఆయనకు ఉంది అభిమానులు అనేకన్నా భక్తులు ఉన్నారంటే కరెక్ట్ గా ఉంటుందేమో. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినిమాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ అన్న చిరు ని మించి ఎదిగాడు. కేవలం సినిమాల వళ్లే కాకుండా మంచి మనిషిగా ఆయనకు అభిమానులు ఉన్నారు. ఎంతో మందికి లెక్కలేనన్ని దానాలు చేసిన పవర్ స్టార్ తన అన్నకు సాధ్యం కానిది సాధించేందుకు కష్టపడుతున్నారు. అదే రాజకీయంగా చిరంజీవి విఫలమైన అదే బాటలో విజయాన్నందుకుని నమ్మిన అభిమానుల కలలు నెరవేర్చాలని ప్రయత్నిస్తున్నారు.

మహిళా కార్యకర్త దగ్గర ఆమె కాళ్ళ వద్ద కూర్చొని…
జనసేన పార్టీ పెట్టి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ అనతి కాలంలోనే పార్టీని బలోపేతం చేసుకున్నారు. పోయిన ఎలక్షన్స్ లో జనసేన పార్టీ కి మంచి ఫలితాలు రాకపోయినా వచ్చే ఎన్నికల కోసం పార్టీ ని బలోపేతం చేసే దిశగా చర్యలు ముమ్మరం చేసారు పీకే. ఆ క్రమంలోనే జనసేన మహిళా కార్యకర్తలు వీరమహిళల కోసం ఎలా మాట్లాడాలి, ఇతర పార్టీల నాయకులు విమర్శించినపుడు ఎలా తిప్పికొట్టాలి అనే అంశాలపై తరగతులు నిర్వహిస్తున్నారు.

దివ్యంగులు పడుతున్న సమస్యలు వారి ద్వారా తెలుసుకుని, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చిన @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు. 1/3#JanaVaaniJanaSenaBharosa pic.twitter.com/hiGodICzjX
— JanaSena Shatagni (@JSPShatagniTeam) July 3, 2022
మంగళగిరిలో నిర్వహిస్తున్న ఈ శిక్షణ తరగతులలో జనసేనాని ఒక వికలాంగురాలైన కార్యకర్తతో మాట్లాడడం కోసం ఆమె పాదాల వద్ద కూర్చున్నారు. ఆమె చెప్తున్న విషయాలను వింటున్న ఈ ఫోటోను సోషల్ మీడియా లో షేర్ చేసిన అభిమానులు దటీజ్ పవన్ కళ్యాణ్, సింప్లిసిటీకి నిలువెత్తు రూపం, ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసి ఉన్న వ్యక్తి అంటూ అత్తారింటికి దారేది సినిమాలో డైలాగు చెబుతూ మురిసిపోతున్నారు అభిమానులు.