Pavithra Lokesh: కన్నడ నటిగా పలు సినిమాలలో హీరోయిన్ గా నటించి అనంతరం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి పవిత్ర లోకేష్ గురించి అందరికీ తెలిసిందే. అయితే తన భర్త నుంచి విడిపోయిన తర్వాత సీనియర్ నటుడు నరేష్ తో సహజీవనం చేస్తున్నారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే వీరిద్దరూ కలిసి పలు సినిమాలలో జంటగా నటించారు.

ఈ క్రమంలోనే వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. తాజాగా వీరిద్దరు కలిసి మహాబలేశ్వరం స్వామివారిని కలవడం కోసం వెళ్లడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది. ఇకపోతే నటి పవిత్ర ఇదివరకే కన్నడ సీరియల్ నటుడు సుచేంద్ర ప్రసాద్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల వీరిద్దరూ విడిగా ఉంటున్నారు.

ఇప్పటివరకు పవిత్ర తన భర్తతో అధికారికంగా విడాకులు తీసుకున్నారా లేదా అనే విషయం తెలియకపోయినప్పటికీ ఈమె నటుడు నరేష్ తో వివాహానికి సిద్ధమయ్యారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని కొట్టిపారేశారు. ఇకపోతే గతంలో పవిత్ర తన భర్త గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. ఈ సందర్భంగా పవిత్ర లోకేష్ మాట్లాడుతూ సీరియల్ లో నటించే సమయంలో తన భర్త పరిచయమయ్యారని తెలిపారు.
ఆయనలో ఒక్క లోపాన్ని కూడా గుర్తించలేము…
ఈ విధంగా కన్నడ సీరియల్ లో నటిస్తున్న సమయంలో మా ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడి ఆ స్నేహం ప్రేమగా మారి ఇద్దరం 2007వ సంవత్సరంలో వివాహం చేసుకున్నామని తెలిపారు. నాతో పోల్చుకుంటే సుచేంద్ర ఎంతో బెటర్. అలాంటి వ్యక్తిని ఎక్కడా చూడలేదు ఆయన చాలా మంచివారు. ఆయనలో ఒక లోపాన్ని కూడా గుర్తించలేము, అలాంటి భర్త దొరకడం నిజంగా నా అదృష్టం అంటూ పవిత్ర గతంలో తన భర్త గురించి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం అవుతున్నాయి.





























