Pavithra Lokesh : గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో బాగా నానుతున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ ఉదంతం రోజుకో మలుపు తిరుగుతూ వైరల్ అవుతోంది. తెలుగులో సీనియర్ నటుడు విజయ నిర్మల కొడుకు నరేష్ నాలుగోసారి పెళ్ళికి సిద్ధమయ్యారంటూ మీడియా కోడై కూసింది. ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ తో ప్రేమాయణం నడుపుతున్నట్లు పుకార్లు షికార్లు చేసాయి. ఇక వీటిమీద ఈ ఇద్దరూ మొదట డైరెక్టగా స్పందించలేదు. మొన్నామధ్య మహాభలేశ్వరంలో కనిపించి మరింత అనుమానాలు పెంచేసారు.

పవిత్ర కు చాలా మందితో సంబంధాలు ఉన్నాయి…
ఇక నరేష్ కు ఇది నాలుగో బంధం కాగా, ఇక పవిత్రకు రెండో బంధం అని మొదటి భర్త సుచేంద్ర ప్రసాద్ కన్నడ ఆర్టిస్ట్ ఆయనతో వివాహం జరిగి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని అందరికి తెలుసు. కానీ సుచేంద్ర ప్రసాద్ తో నాకు పెళ్లి కాలేదని ఇద్దరం కేవలం సహజీవనం చేశామని పవిత్ర బాంబు పేల్చింది. ఇక తాజాగా పవిత్ర మీద కన్నడ న్యూస్ ఛానెల్ చేసిన స్ట్రింగ్ ఆపరేషన్ లో తాను నరేష్ తో సహజీవనం చేస్తున్నట్లు పవిత్ర ఒప్పుకున్నారు. ఇక ఈ విషయంలో గురించి పవిత్ర మొదటి భర్త సుచ్చేంద్ర ప్రసాద్ స్పందించారు.

పవిత్ర క్యారెక్టర్ మంచిది కాదని, తాను పిల్లలను నన్ను వదిలి వెళ్ళిపోయాక చాలా హ్యాపీగా ఉన్నాము. పవిత్రకు నాతో ఉన్నపుడే వేరే వాళ్ళతో సంబంధాలు ఉన్నాయని నా దృష్టికి వచ్చిందని అయితే తన మీద ప్రేమ వల్ల నేను పట్టించుకోలేదని, ఇక నాకంటే ముందు ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తో వివాహం జరిగిందని, అతనితోను ఎక్కువ రోజులు ఉండలేదని, తనకు కావాల్సింది డబ్బు మాత్రమే అని చెప్పారు. ఇపుడు కూడా నరేష్ తో పెళ్లి జరిగినా ఆరు నెలల తరువాత తన ఆస్తి తీసుకుని వీడిపోతుంది పవిత్రకు కావాల్సింది డబ్బు, లగ్జరీ జీవితం మాత్రమే అని సుచేంద్ర ఘాటుగా స్పందించారు.


































