Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించి రాజకీయాల్లో బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే. అక్టోబర్ నెలలో బస్సు యాత్ర కూడా ప్రారంభించి, ఇందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అయితే రాజకీయాల్లో ఎంత బిజీ గా ఉన్నా ఒకవైపు సినిమాలు కూడా చేస్తున్నారు. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ‘హరి హర వీరమల్లు’ సినిమా చేస్తున్నారు. దీనితో పాటు వినోదయ సీతమ్ రీమేక్ కూడా చేయబోతున్నారు.

పవన్ కళ్యాణ్ పెళ్లి కోసం అప్పట్లోనే రూ.10 లక్షలు ఖర్చు పెట్టిన చిరంజీవి…
పవన్ కళ్యాణ్ సినీ రాజకీయ జీవితం అంటుంచి వ్యక్తిగత జీవితం గురించి వస్తే ఆయనకు ముగ్గురు భార్యలు అని తెలిసిందే. పవన్ కళ్యాణ్ మొదట సినిమాల్లోకి రాకముందే విశాఖపట్నానికి చెందిన నందిని అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. అప్పట్లోనె చిరంజీవి రూ.10 లక్షలు ఖర్చు చేసి పవన్ పెళ్లిని చేయించారు. అయితే పెళ్లి తరువాత బద్రి సినిమాతో రేణుదేశాయ్‌కి పవన్‌కు మధ్య సహజీవన సంబంధం ఏర్పడటం తరువాత చిరంజీవి ప్రజా రాజ్యం పార్టీని పెట్టడం విమర్శలు రావడంతో నందినికి విడాకులు ఇచ్చి రేణు దేశాయ్‌ని వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ వివాహం సమయానికే ఇద్దరు పిల్లలు కూడా వున్నారు.

అయితే తరువాత రేణు దేశాయ్ కి కూడా విడాకులు ఇచ్చి ప్రస్తుతం పవన్ కల్యాణ్ రష్యాకు చెందిన అన్నా లెజినివా ను 3వ పెళ్లి చేసుకుని తనతో కలసి ఉంటున్న సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉండగా మొదటి భార్య నందినికి విడాకులు ఇచ్చినపుడు ఆమెకు భరణం కింద రూ.30 లక్షలు ఇచ్చారట. విడాకుల తరువాత నందిని వైజాగ్‌కు చెందిన ఒక డాక్టర్‌ను వివాహం చేసుకుని అక్కడే సెటిల్ కూడా అయింది. అయితే పవన్ వివాహ సమయంలో ఆమె నుంచి ఎలాంటి కట్నం తీసుకోలేదని సమాచారం.


































