Pawan Kalyan : టాలీవుడ్లో పవన్ కళ్యాణ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన చేయి ఎత్తితే చాలు ఏదైనా చేసేందుకు సిద్ధమైపోతుంటారు ఫ్యాన్స్. ఆయనకు వాళ్లు కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు భక్తులు కూడా. ఏదైనా ఆయన సినిమా రిలీజ్ అయితే ఆరోజు మాస్ జాతరే.. ఒక వేళ సినిమా ఫ్లాప్ అయినా ఆయన రేంజ్ మాత్రం ఎప్పటికీ తగ్గదు. ప్రస్తుతం ఓ వైపు సినిమాలు తీస్తూనే.. మరోవైపు రాజకీయాల్లో ఫుల్ బిజీగా గడుపుతున్నారు పవన్.

పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎంత బిజీగా ఉన్నాడో చెప్పాల్సిన అవసరం లేదు. ఒకటి రెండూ కాదు కెరీర్‌లో ఎప్పుడూ లేని విధంగా ఒకేసారి 5 సినిమాలకు సైన్ చేశాడు పవర్ స్టార్. రాబోయే రెండేళ్లు పూర్తిగా బిజీగా ఉన్నాడు. మధ్యలో కరోనా రావడంతో అనుకున్న ప్లాన్స్ వర్క్ ఔట్ కావడం లేదు కానీ లేదంటే ఈ పాటికి పవన్ కళ్యాణ్ నటించిన రెండు, మూడు సినిమాలు విడుదలై ఉండేవి.

ఇలా ఉంటే తన దగ్గర సినిమా చేయాలి అనుకునే దర్శక నిర్మాతలకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు పవన్ కళ్యాణ్. అలాగే కొన్ని కండిషన్స్ అప్లై అంటున్నాడు పవన్. పవన్ ప్రస్తుతం భీమ్లా నాయక్, హరిహర వీరమల్లు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇందులో భీమ్లా నాయక్ విడుదలకు సిద్ధంగా ఉంది. సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 25న విడుదల కానుంది. మరోవైపు క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు కూడా సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది.
పవన్ పెట్టిన ఆ కండిషన్ కి మేకర్స్ ఓకే అంటారా ?
వీటితో పాటు హరీశ్ శంకర్, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమాలకు కమిట్ అయ్యాడు పవన్. త్వరలోనే ఈ సినిమాలు సెట్స్ పైకి వెళ్లనున్నాయి. గబ్బర్ సింగ్ తర్వాత హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా భవదీయుడు భగత్ సింగ్. ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక నుంచి పవన్ చేసే ఒక్కో సినిమాకు 60 రోజుల కాల్షీట్ మాత్రమే ఇస్తాడు అన్నమాట. కాబట్టి, ఆయనతో సినిమాలు ప్లాన్ చేసే వారంతా ఆ లోపే షూటింగ్ పూర్తి చేసేయాలి. కచ్చితంగా అలా చెయ్యాలని పవన్ కళ్యాణ్ కండీషన్ పెట్టినట్లు తెలుస్తోంది.





























