పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సెకండ్ ఇన్నింగ్స్ ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం చేతినిండా వరస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న పవన్ భీమ్లా నాయక్, హరిహర వీరమల్లు లాంటి సినిమాల్లో నటిస్తున్నాడు.

పవన్ కళ్యాణ్ చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ అతడు కోట్లాది మంది ప్రేక్షకుల మనసులలో స్థానం సంపాదించుకున్నాడు. పవన్ అభిమానులు అతడిని ప్రేమతో పవర్ స్టార్ అని పిలుచుస్తుంటారు. ఇక పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతుంది అంటే థియేటర్ల దగ్గర పండుగ వాతావరణం నెలకొంటుంది.భారీ కటౌట్లతో సందడి సందడిగా ఉంటుంది.
ఇదిలా ఉంటే ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ కి పవర్ స్టార్ అన్న పిలుపు నచ్చడం లేదు.అందుకు ఉదాహరణగా ఇటీవల జరిగిన ఒక మీటింగ్‌లో పవర్ లేనివాడు పవర్ స్టార్ కాదని తనని కేవలం జనసేనాని అని పిలవండి చాలు అన్నారు. తాను సరదాగా రాజకీయాలు చేయడం లేదని,బాధ్యతతో రాజకీయాలు చేస్తున్నాని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
ఇక తాజాగా పవన్ కళ్యాణ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో మీటింగ్ ఏర్పాటు చేయగా, అక్కడ అతని అభిమానులు పవర్ స్టార్ అంటూ గోలలు చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్.. సభా మర్యాద తెలియదా, పవర్ స్టార్ అని ఎందుకు అరుస్తున్నారు. నన్ను పవర్ స్టార్ అని పిలవడం మానేయండి, ఇంకొకసారి పవర్ స్టార్ అని పిలవకండి అంటూ పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే పవన్ కళ్యాణ్ కి పవర్ స్టార్ అన్న బిరుదును పోసాని కృష్ణ మురళి ఇవ్వడం గమనార్హం.






























