Political News

Sekhar Kammula – Pawan Kalyan Combo: శేఖర్ కమ్ములతో పవన్ కళ్యాణ్ సినిమా..? ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిన చర్చ!

టాలీవుడ్‌లో తనదైన శైలితో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల (Sekhar Kammula) ఇప్పటికీ సినిమాలను కంటెంట్‌తో నడిపించే దర్శకుడిగా నిలిచారు. గోదావరి, ఆనంద్, హ్యాపీ డేస్, లీడర్, ఫిదా, లవ్ స్టోరీ వంటి సినిమాలు ఆయనకు క్లాస్ డైరెక్టర్‌గా ఓ ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చాయి. ఇటీవల విడుదలైన కుబేర సినిమా ఆయన కంఫర్ట్ జోన్‌కు దూరంగా ఉన్నప్పటికీ మంచి వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద సక్సెస్‌ను అందుకుంటోంది. ట్రేడ్ సర్కిల్స్ ప్రకారం ఈ సినిమా ఫుల్‌రన్‌లో రూ.200 కోట్లు రాబట్టే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు.

Pawan Kalyan’s film with Shekhar Kammula..?

ఇంతవరకూ మీడియం రేంజ్ హీరోలతోనే సినిమాలు చేసిన శేఖర్ కమ్ముల ఇప్పుడు ఫైనల్‌గా స్టార్ హీరోల వైపు అడుగులు వేస్తున్నారని సమాచారం. గతంలో ఆయన పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మరియు మహేష్ బాబు (Mahesh Babu) లాంటి పెద్ద హీరోలతో స్క్రిప్ట్‌లు రెడీ చేసినప్పటికీ, వాటికి అనుకున్న విధంగా ఫలితం రాలేదు. ముఖ్యంగా గోదావరి సినిమాను పవన్ తో ప్లాన్ చేసినా, అప్పట్లో కుదరలేదు. అలా ప్రతీ కథలో పవన్‌ను హీరోగా ఊహించుకునే శేఖర్ కమ్ములకు ఇప్పుడు నిజంగా పవన్ కళ్యాణ్‌తో సినిమా చేసే అవకాశమొచ్చిందనే ప్రచారం సినీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.

ఈ కాంబినేషన్ వెనుక కీలకంగా ఉన్నది దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. పవన్‌కు అత్యంత సన్నిహితుడైన త్రివిక్రమ్, శేఖర్ కమ్ముల‌తో కలిసి ఓ పొలిటికల్ డ్రామాను ప్లాన్ చేస్తున్నారని టాక్. దీనికి కుబేర చిత్రం విజయవంతంగా నిలవడం ఓ బూస్ట్‌గా మారిందని అంటున్నారు. ముఖ్యంగా శేఖర్ గతంలో లీడర్ సినిమాలో మాదిరిగా, ప్రస్తుతం రాజకీయ పరిస్థితులపై పవన్ కళ్యాణ్‌ను నాయ‌కునిగా చూపిస్తూ ఓ బలమైన కథ రాబోతుందట. ఇప్పటికే పవన్ రాజకీయాల్లో ఉన్న నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్‌కు జనం నుంచి, అభిమానుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చే అవకాశముందని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ప్రస్తుతం పవన్ సినిమాల నుంచి రాజకీయాల దాకా తన ఒత్తిడి షెడ్యూల్‌తో బిజీగా ఉన్నా, ఈ కాంబినేషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. ఇది నిజంగా రియలిటీ అయితే, టాలీవుడ్‌కి ఇది ఓ క్రేజీ కాంబో అనే చెప్పొచ్చు. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన రావొచ్చన్న అంచనాల మధ్య, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించే సినిమా టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

telugudesk

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago