టాలీవుడ్‌లో తనదైన శైలితో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల (Sekhar Kammula) ఇప్పటికీ సినిమాలను కంటెంట్‌తో నడిపించే దర్శకుడిగా నిలిచారు. గోదావరి, ఆనంద్, హ్యాపీ డేస్, లీడర్, ఫిదా, లవ్ స్టోరీ వంటి సినిమాలు ఆయనకు క్లాస్ డైరెక్టర్‌గా ఓ ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చాయి. ఇటీవల విడుదలైన కుబేర సినిమా ఆయన కంఫర్ట్ జోన్‌కు దూరంగా ఉన్నప్పటికీ మంచి వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద సక్సెస్‌ను అందుకుంటోంది. ట్రేడ్ సర్కిల్స్ ప్రకారం ఈ సినిమా ఫుల్‌రన్‌లో రూ.200 కోట్లు రాబట్టే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు.

ఇంతవరకూ మీడియం రేంజ్ హీరోలతోనే సినిమాలు చేసిన శేఖర్ కమ్ముల ఇప్పుడు ఫైనల్‌గా స్టార్ హీరోల వైపు అడుగులు వేస్తున్నారని సమాచారం. గతంలో ఆయన పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మరియు మహేష్ బాబు (Mahesh Babu) లాంటి పెద్ద హీరోలతో స్క్రిప్ట్‌లు రెడీ చేసినప్పటికీ, వాటికి అనుకున్న విధంగా ఫలితం రాలేదు. ముఖ్యంగా గోదావరి సినిమాను పవన్ తో ప్లాన్ చేసినా, అప్పట్లో కుదరలేదు. అలా ప్రతీ కథలో పవన్‌ను హీరోగా ఊహించుకునే శేఖర్ కమ్ములకు ఇప్పుడు నిజంగా పవన్ కళ్యాణ్‌తో సినిమా చేసే అవకాశమొచ్చిందనే ప్రచారం సినీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
ఈ కాంబినేషన్ వెనుక కీలకంగా ఉన్నది దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. పవన్‌కు అత్యంత సన్నిహితుడైన త్రివిక్రమ్, శేఖర్ కమ్ములతో కలిసి ఓ పొలిటికల్ డ్రామాను ప్లాన్ చేస్తున్నారని టాక్. దీనికి కుబేర చిత్రం విజయవంతంగా నిలవడం ఓ బూస్ట్‌గా మారిందని అంటున్నారు. ముఖ్యంగా శేఖర్ గతంలో లీడర్ సినిమాలో మాదిరిగా, ప్రస్తుతం రాజకీయ పరిస్థితులపై పవన్ కళ్యాణ్‌ను నాయకునిగా చూపిస్తూ ఓ బలమైన కథ రాబోతుందట. ఇప్పటికే పవన్ రాజకీయాల్లో ఉన్న నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్‌కు జనం నుంచి, అభిమానుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చే అవకాశముందని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ప్రస్తుతం పవన్ సినిమాల నుంచి రాజకీయాల దాకా తన ఒత్తిడి షెడ్యూల్‌తో బిజీగా ఉన్నా, ఈ కాంబినేషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. ఇది నిజంగా రియలిటీ అయితే, టాలీవుడ్‌కి ఇది ఓ క్రేజీ కాంబో అనే చెప్పొచ్చు. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన రావొచ్చన్న అంచనాల మధ్య, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించే సినిమా టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

































