Pay For View in OTT : ఇటీవల ఓటీటీ లో విడుదల అయిన కేజీఫ్ 2 ఇంకా విడుదలకు సిద్ధంగా వున్న ఆర్ఆర్ఆర్ సినిమా తో పే ఫర్ వ్యూ తెర మీదకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే థియేటర్ లో ఎక్కువ ధరకు టికెట్ కొని చూస్తున్న ప్రేక్షకులకు ఇపుడు ఓటీటీలో కూడా డబ్బులు చెల్లించడానికి ఆసక్తి కనబరుస్తారా లేదా అన్నది చర్చనీయంశంగా మారింది. అమెజాన్ ప్రైమ్ లో కేజీఫ్ 2 సినిమాకి రూ.199 చెల్లించి చూడాలని, చెల్లించాక 48 గంటల సమయం ఇస్తున్నారు అమెజాన్ ప్రైమ్. అయితే దీనికి ప్రేక్షకులు సుముఖత చూపిస్తారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా వుంది.

పే ఫర్ వ్యూ వర్క్ ఔట్ అవుతుందా….
ప్రేక్షకులు వందలకు వందలు టికెట్ లు కొని థియేటర్స్‌లో సినిమాలు చూసిన ఆడియన్స్‌కు ఆ తర్వాత ఓటీటీలో విధులకు అయ్యాక సినిమా చూద్దామంటే.. ఇపుడు కొత్తగా వచ్చిన పే ఫర్ వ్యూ ఇపుడు అన్నిచోట్లా చర్చనీయంశం అవుతోంది. ఇప్పటికే థియేటర్స్‌లో అధిక ధరలలో టికెట్ లని చూసి భయపడుతున్న సినీ అభిమానులు .. పైరసీ ప్రింట్స్ వైపు మొగ్గుచుపిస్తున్నారు. ఇక ఈమధ్య ఓటీటీల పుణ్యామా అని చాలా మంది మధ్య తరగతి సినీ అభిమానులు ఓటీటీలో మంచి ప్రింట్ చూద్దామని దానికి చందాదారులు అయ్యారు. ఇక ఇపుడు వారిలో చాలా మంది అమెజాన్, జీ 5, నెట్‌ఫ్లిక్స్, హాట్ స్టార్ వంటి వాటికి అడిక్ట్ అయ్యారు. ఇలా వాటికి చందా కట్టినా కూడా ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌లో సినిమా చూడాలి అంటే ఇలా డబ్బులు కట్టాలి అంటూ ప్రేక్షకుల నుంచి దోచుకోవడం ఏంటి అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శిస్తున్నారు.

పే ఫర్ వ్యూ ఇలానే కొనసాగితే చాలా మంది సినీ అభిమానులు మంచి ప్రింట్స్ దొరికుతున్న పైరసీ వెబ్‌సైట్స్‌ను ఆశ్రయించే అవకాశాలు కూడా వున్నాయి. ఇప్పటికే నెట్లో ఇలాంటి పైరసీ వెబ్ సైట్స్ చాలా ఉన్నాయి. ఒకసారి ఇలాంటి పైరసీ వెబ్ సైట్ లో దొరికే HD ప్రింట్ లకు అలవాటు పడితే సినీ అభిమానులు మళ్లీ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ చందాదారులుగా ఉండడానికి ఇష్టపడరు. ఏది ఏమైనా పే ఫర్ వ్యూ అనుసరిస్తు ఓటీటీ సంస్థలు చేస్తోన్న దోపిడి ఎంతవరకు విజయం సాధిస్తుందో.. లేకపోతే మొదటికే మోసం వచ్చి ఓటీటీ లో చూడటం ప్రేక్షకులు మనుకుంటారో అనేది చూడాలి.































