Movie News

Payal Ghosh: ఎన్టీఆర్ గురించి ఆరోజు చెబితే నవ్వారు.. నేడు అదే నిజమైంది: నటి పాయల్ ఘోష్

Payal Ghosh: తెలుగు చిత్ర పరిశ్రమలో యంగ్ హీరో ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే ఈయన కేవలం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మాత్రమే కాకుండా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమా ద్వారా పాన్ ఇండియా… పాన్ వరల్డ్ స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు. ఈ సినిమా ద్వారా ఎన్టీఆర్ కి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.

ఇలా ఎన్టీఆర్ ఈ సినిమా ద్వారా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకోవడంతో ఈయనకు విపరీతమైన అభిమానులు పెరిగిపోవడం కాకుండా ఈ సినిమాకు గాను తప్పనిసరిగా ఎన్టీఆర్ కి ఆస్కార్ అవార్డు వస్తుందని ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ నటించిన ఊసరవెల్లి సినిమాలో తమన్నా స్నేహితురాలి పాత్రలో నటించారు నటి పాయల్ ఘోష్.

ఈ సినిమా సమయం నుంచి ఈమె ఎన్టీఆర్ నటనకు తన డెడికేషన్ కు ఫిదా అయ్యారు. అప్పటినుంచి ఎన్టీఆర్ కి అభిమానిగా మారినటువంటి పాయల్ ఘోష్ RRR విడుదలకు ముందు ఎన్టీఆర్ గ్లోబల్ ఫేస్ అంటూ తనని వ్యాఖ్యానించారు. ఈ విధంగా ఎన్టీఆర్ గ్లోబల్ ఫేస్ అంటూ పాయలు చేసినటువంటి కామెంట్స్ విన్నటువంటి కొందరు హేళన చేస్తూ నవ్వారు.

Payal Ghosh: నేను చెప్పినదే నిజమైంది..


అయితే ఈ సినిమా విడుదలైన తర్వాత ఎన్టీఆర్ ఏకంగా ఫాన్ వరల్డ్ స్థాయిలోనే ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు. అయితే గతంలో నటి పాయల్ కోసం చేసినట్టు వ్యాఖ్యలు అక్షరాల నిజమయ్యాయి.ఇదే విషయాన్ని తాజాగా పాయల్ గుర్తు చేసుకుంటూ ఆరోజు నేను ఎన్టీఆర్ గ్లోబల్ ఫేస్ అంటే అందరూ నవ్వారు ఇప్పుడు అదే నిజమైంది అంటూ ఈమె గర్వంగా ఫీల్ అవుతూ చేసినటువంటి ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మార్చి 3 చంద్రగ్రహణ ప్రభావం.. జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులే!

2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…

2 hours ago

మేడి పండులో నిజంగానే పురుగులుంటాయా? అసలు నిజం ఇదే!

“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…

2 hours ago

వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ? క్లారిటీ ఇచ్చిన కవిత:

తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…

2 hours ago

తెలంగాణ విమానయాన రంగంలో మరో అడుగు.. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు కేంద్ర గ్రీన్ సిగ్నల్:

తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…

4 hours ago

నెలసరి నొప్పులతో బాధపడుతున్నారా? ఈ నేచురల్ జ్యూస్ ట్రై చేయండి!

నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…

4 hours ago

కష్టమే విజయానికి దారి – మృణాల్ ఠాకూర్ ప్రేరణాత్మక వ్యాఖ్యలు…

సినీ పరిశ్రమలో కనిపించే మెరుపులు, గ్లామర్‌ వెనుక ఎన్నో సంవత్సరాల కష్టం దాగి ఉంటుందని ప్రముఖ నటి Mrunal Thakur…

5 hours ago