సాధారణంగా కిడ్నీ సమస్యలతో బాధపడే వారు డయాలసిస్ చేయించుకుంటూ వుంటారు. అయితే ఈ విధంగా డయాలసిస్ చేయించుకునేవారు ఒక డయాలసిస్ సెషన్‌కీ డయాలసిస్ చేయించుకుంటున్న వ్యక్తి సుమారుగా 16 గ్రాముల ప్రోటీన్ లను కోల్పోవలసి వస్తుంది. ఈ క్రమంలోనే వారి శరీరానికి తగినంత ప్రొటీన్ అవసరం ఎంతో ఉంటుంది. అయితే ప్రోటీన్లు మన శరీరానికి పుష్కలంగా లభించాలంటే తగినంత మాంసాహార పదార్ధాలను ఎక్కువగా తీసుకోవాలి.

ఈ క్రమంలోనే డయాలసిస్ చేయించుకున్న పేషెంట్లు శాకాహారులైతే వారు ప్రొటీన్ల కోసం ప్రత్యేకించి మాంసాహారం తినాల్సిన పని లేదు. ఎందుకంటే మాంసాహారంలో లభించే టటువంటి ప్రొటీన్లు అన్ని శాకాహార పదార్థాలలో కూడా మనకు లభ్యమవుతాయి. మీరు తీసుకునే ఆహార పదార్థాలతోపాటు ఫాస్ఫేట్ బైండర్స్ తీసుకోవటం వల్ల మన శరీరానికి కావలసిన ప్రొటీన్లు అందుతాయి.ఈ విధంగా డయాలసిస్ చేయించుకున్న శాఖాహారులు కోల్పోయిన ప్రోటీన్లను తిరిగి పెంపొందించుకోవాలంటే ఈ ఆహార పదార్థాలు తప్పనిసరిగా తీసుకోవాలి.
ప్రొటీన్లు అధికంగా లభించేటటువంటి మీల్ మేకర్, సోయా మిల్క్, సోయా ఫ్లేక్స్, తోఫూ వంటి సోయా అధికంగా తీసుకోవటం వల్ల తగినన్ని ప్రొటీన్లు పొందవచ్చు. అధిక మొత్తంలో పాలు పాల పదార్థాలను తీసుకోవడం వల్ల మన శరీరానికి తగినన్ని ప్రొటీన్లు అందుతాయి. వీటితోపాటు ప్రతిరోజు బీన్స్, పప్పు దినుసులను అధికంగా తీసుకోవడం వల్ల డయాలసిస్ పేషంట్ లు కోల్పోయిన ప్రొటీన్లను పొందవచ్చు.





























