ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎంతో తీవ్రరూపం దాలుస్తున్న కరోనా రెండవ దశ వేరియంట్ ను గత ఏడాది అక్టోబర్ లోనే శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ క్రమంలోనే భారత్ లో తొలిసారిగా గుర్తించిన రెండు వేరియంట్లపై ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్‌లు సమర్ధవంతంగా పని చేస్తున్నట్లు అమెరికా పరిశోధకులు తెలియజేశారు.
ఎన్‌వైయూ గ్రూస్‌మెన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్, ఎన్‌వైయూ లాంగోన్ సెంటర్ సంయుక్తంగా జరిపిన పరిశోధనలో భారత్ రకం వేరియంట్లపై ఈ ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్లు ఎంతో సమర్థవంతంగా పని చేస్తున్నట్లు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. ఈ టీకాల వల్ల వేరియంట్ లకు వ్యతిరేకంగా పోరాడే యాంటీ బాడీస్ బలహీన పడినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఈ పరిశోధనలో భాగంగా ఈ రెండు రకాల వ్యాక్సిన్లు తీసుకున్న వారి నుంచి రక్తనమూనాలను సేకరించి స్పైక్ ప్రాంతంలో వేరియంట్లను సూడోవైరస్ ఇంజినీరింగ్ ద్వార వేరు చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే ల్యాబ్ లో పెరిగిన కణాలపై యాంటీబాడీలు ఏ విధంగా పని చేస్తున్నాయని పరిశీలించగా B.1.617 వేరియంట్‌ను తటస్థీకరించే యాండీబాడీల పరిమాణంలో దాదాపు నాలుగు రెట్లు తగ్గినట్లు గుర్తించారు.
కొన్ని రకాల యాంటీబాడీలు ఈ వేరియంట్‌లపై పనిచేయకపోయినా.. మిగతా యాంటీబాడీలు మాత్రం వాటిని సమర్ధంగా అడ్డుకున్నాయని శాస్త్రవేత్తలు చెప్పారు. దీనిని బట్టి చూస్తే ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్లు ఎంతో సమర్థవంతంగా పనిచేస్తాయని నిపుణులు భావిస్తున్నారు
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…