ఎస్ బ్యాంక్ తీవ్ర సంక్షోభంలో ఉంది. ఈ నేపథ్యంలో డిపాజిటర్లు, ఇన్వెస్టర్లలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. అయితే ఈ విషయం తెలుసుకున్న ఖాతాదారులు ఆ బ్యాంకులు, ఏటీఎం వద్ద డబ్బులు విత్ డ్రా చేసుకునేందుకు క్యూ కట్టారు. అకౌంటు హోల్డర్స్ అంటా ఒకేసారి డబ్బు విత్ డ్రా చేస్తే ఆ బ్యాంకు మరింత సంక్షోభంలోకి కూరుకుపోయే అవకాశం ఉన్నందున ఆ విత్ డ్రా లిమిట్ పై ఆర్బీఐ పలు షరతులను విధించింది.

విత్ డ్రా లిమిట్ ను కేవలం 50 వేలకు కుదించింది. ఏప్రిల్ 3వ తేదీ వరకు ఎస్ బ్యాంకు అకౌంట్ హోల్డర్స్ ఒకొక్కరు 50 వేలు మాత్రమే విత్ డ్రా చేసుకోగలరు. అంతకుమించి తీసుకోడానికి వీలు లేకుండా నిషేధం విధించింది ఆర్బీఐ.

మరోవైపు ఎస్ బ్యాంకు సంక్షోభం “ఫోన్ పే” ను తాకింది. ప్రముఖ ఆన్లైన్ ప్రెమెంట్స్ యాప్ “ఫోన్ పే” ఇదివరకే ఎస్ బ్యాంకు తో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఎస్ బ్యాంకు సంబంధించిన చెల్లింపులు, లావాదేవీలు అన్నీ ఫోన్ పే ద్వారానే జరుగుతాయి. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి నుంచి ఫోన్ పే సర్వీసులన్నీ నిలిచిపోయాయి. సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ఫోన్ పే చీఫ్ ఎక్జిక్యూటివ్ సమీర్ నిగమ్ తన ట్విట్టర్ అకౌంట్ లో ట్వీట్ చేసారు. దేనితో కస్టమర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎస్ బ్యాంకుతో భాగస్వామ్యం వలనే ఈ సమస్య వచ్చిందని, త్వరలో తమ సర్వీసులను తిరిగి ప్రారంభిస్తామని ఫోన్ పే సంస్థ తెలిపింది.

ఈరోజు ఉదయం నుండి ఫోన్ పే సర్వీసులు ప్రారంభమయ్యాయని తెలుస్తుంది. అయినా కూడా కొంత మంది కస్టమర్లు తమ లావాదేవీల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here