కేంద్ర ప్రభుత్వం పేదల కోసం మరో పథకానికి నేడు శ్రీకారం చుట్టబోతుంది. ఉజ్వల 2.0 పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ లాఛనంగా ప్రారంభించనున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని మహోబా జిల్లా నుంచి ఈ పథకం మెుదలుకాబోతుంది. ప్రధాని వర్చువల్‌గా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.

ఉజ్వల స్కీమ్‌ను 2016లో క్రేందం ప్రారంభించింది. ఈ ఫథకం ద్వారా దేశంలో ఐదు కోట్ల మహిళలకు గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఏటా..ఏటా ఈ పథాకాన్ని విస్తరిస్తూ వస్తోంది. 2018లో మరో ఏడు వర్గాలకు కలుపుకుని ఎనిమిది కోట్ల మంది ఈ స్కీం వర్తింప చేసేలా చర్యలు చేపట్టింది. ఇక 2021-22 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్‌లో పీఎంయూవై పథకం కింద కోటి గ్యాస్ కనెక్షన్ల ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది.

































