Geethanjali: గీతాంజలి ఆత్మహత్య కేసులో టీడీపీ కార్యకర్త రాంబాబు అరెస్ట్?

Geethanjali: తెలుగుదేశం పార్టీ జనసేన సోషల్ మీడియా కార్యకర్తలు కారణంగా ఓ గృహిణి ఆత్మహత్య చేసుకొని మరణించిన సంగతి మనకు తెలిసిందే. కేవలం తనకు జగనన్న ఇల్లు పట్టా ఇచ్చారని తనకు జగన్ ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు అందాయనే సంతోషంగా చెప్పడమే ఆమె పాలిట శాపంగా మారింది.

ఇలా తెనాలికి చెందిన గీతాంజలి తన సంతోషాన్ని పంచుకోవడంతో ఆ విషయాన్ని జీర్ణించుకోలేనటువంటి పచ్చ సైకోలు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తూ ఆమెను మానసికంగా హింసించారు. దీంతో ఈమె రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఇలా తనని మానసికంగా కృంగబాటకు గురిచేసినటువంటి వారిపై పోలీసులు చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు.

గీతాంజలి కేసు విషయంలో పోలీసులు కూడా దూకుడు కనబరుస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక టీడీపీ కార్యకర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ సోషల్‌ మీడియా కార్యకర్త పసుమర్తి రాంబాబును విజయవాడలో అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించినట్లు సమాచారం. గురువారం ఉదయాన్నే ఆయన ఇంటికి వెళ్లిన పోలీసులు తమతో రావాలని చెప్పారు.

ట్రోల్స్ వల్లే గీతాంజలి చనిపోయింది..

తనకు ముందస్తు నోటీసులు ఏమాత్రం అందడం లేదని తాను రానని, నోటీసులు పంపిస్తే ఎక్కడికి రమ్మన్నా వస్తాను అంటూ రాంబాబు మొండి చేసినప్పటికీ పోలీసులు తనని అదుపులోకి తీసుకొని జైలుకు తరలించారు. ఇలా ఈ కేసు విషయంలో టిడిపి నేతలు అరెస్ట్ అవుతున్నటువంటి తరుణంలో ఈమె ఆత్మహత్యకు టిడిపి సోషల్ మీడియా కార్యకర్తలే కారణమని స్పష్టంగా అర్థమవుతుంది.