Political Analyst Ankamma rao : ఏపీ రాజకీయాల్లో అధికార పక్షం వైసీపీ, ప్రతిపక్షం టీడీపీ మధ్య రాజకీయ పోరు కాస్త వ్యక్తిగతం అయిపోయింది. విమర్శలు తారా స్థాయికి చేరిపోయాయి. అధికార పార్టీ రాష్ట్ర అభివృద్ధి కంటే టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజక వర్గం కుప్పంలో ఆయనను ఓడించడానికి సర్వ శక్తులు ఒడ్డుతున్నారు. జగన్ పదే పదే టీడీపీ శ్రేణులను నిరాశ పరిచడానికి చంద్రబాబు కుప్పంలోనే ఓడిపోతారు 175 కి 175 ఈసారి వైసీపీ ఖాతలో ఉంటాయంటూ చెబుతుంటారు. తాజాగా చంద్రబాబు కుప్పం మాత్రమే కాకుండా మరో నియోజకవర్గంలో కూడ ఈసారి పోటీ చేస్తారంటు వస్తున్న వార్తలలో నిజమేంత అనే విషయాలను పొలిటికల్ అనలిస్ట్ అంకమ్మ రావు గారు తెలిపారు.

చంద్రబాబును ఓడించడానికి జగన్ కొత్త వ్యూహాలు….
ప్రతి ఐదేళ్లకోసారి ఎన్నికలు వస్తూనే ఉంటాయి. కానీ ఈసారి ఎన్నికలలో ఏపీ సీఎం జగన్ మొత్తం సీట్లు వైసీపీ గెలుస్తుందంటూ “వై నాట్ 175” అనే నినాదం తో వెళ్తున్నారు. ఇది కొంచం ఎక్కువైనా ఇందులోనూ ఒక వ్యూహం ఉంది. అధికార పార్టీ కి ఏమాత్రం వ్యతిరేకత లేదని చూయించుకునే ప్రయత్నం అలానే ప్రతిపక్షాల ఆత్మవిశ్వాసం ను దెబ్బతీసే ప్రయత్నం. అయితే ఈసారి వైసీపీ కుప్పంలో చంద్రబాబు ను ఓడించడానికి చాలా ప్రయత్నింస్తోంది. కానీ అవేవి ఫలించవు అంటూ అనలిస్ట్ అంకమ్మ రావు తెలిపారు.

తాజాగా జరిగిన అమరావతి ఏరియా లోని లోకల్ బాడీ ఎలక్షన్స్ లో టీడీపీ మద్దతుదారులు గెలవడం మరోవైపు లోకేష్ యువ గళంకు రోజు రోజుకు ఆధరణ పెరుగుతోందని ఆయన వివరించారు. ఇక కుప్పంలో గత ఎన్నికలలో చంద్రబాబు మీద పోటీ చేసిన వ్యక్తే ఇపుడు టీడీపీలో చేరిపోయాడంటే ఇక కుప్పంలో వైసీపీ వచ్చే సీన్ లేదంటూ తెలిపారు. కేవలం వైసీపీ మైండ్ గేమ్ ఆడుతోందని వివరించారు.





























