Poonam Kaur : హైదరాబాద్ కు చెందిన పూనమ్ కౌర్ చేసింది కొన్ని సినిమాలైనా అందులో పెద్ద హిట్ సినిమాలు ఏమీ లేకపోయినా అమ్మడికి క్రేజ్ మాత్రం ఉంది. అందుకే సోషల్ మీడియాలో బాగానే ఫాలోయింగ్ మెయిటైన్ చేస్తుంది. ఆ మధ్య పీకే అంటే నేనే అంటూ పీకే ఫ్యాన్స్ కి బాగానే ఇచ్చిన ఈ అమ్మడు సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతూ బాగానే వైరల్ అవుతుంటుంది. ఎస్వి కృష్ణ రెడ్డి ‘మాయాజాళం’ సినిమాతో ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన పూనమ్ పెద్ద చెప్పుకోతగ్గ సినిమాల్లో నటించలేదు.

బికినీ వేస్తే తప్పేంటి…
సోషల్ మీడియాలో బాగా చురుగ్గా ఉండే పూనమ్, అమ్మాయిల బట్టల గురించి కామెంట్స్ చేసే బ్యాచ్ కి ఇచ్చిపడేసింది. అమ్మాయిలు పొట్టి బట్టలేసుకుని తిరిగితే రేపులు జరుగుతాయాంటూ మాట్లాడే వారికి క్లాస్ పీకింది. రోజూ జరుగుతున్న అత్యాచారాలు చూస్తే నిండుగా బట్టలేదుకున్న వాళ్ళకే ఎక్కువ దాడులు జరిగాయి తెలుసుకోండి అంటూ లెక్చర్ ఇచ్చింది. అయినా ఎవరికి నచ్చినట్టు దుస్తులు వాళ్ళు వేసుకుంటారు.

నాకు కంఫర్ట్ అనిపించిన బట్టలు నేను వేసుకుంటా. “నేను బురఖా వేసుకుంటా అలాగే చీరలు కడతాను, అలాగే బీచ్ కి వెళితే బికినీ వేసుకుంటా అది నా కంఫర్ట్, దానికి తగ్గట్టే బట్టలేసుకుంటా అది నా ఇష్టం మీకేంటి మధ్యలో” అంటూ అమ్మడు ఫైర్ అయింది. ఇలా ఆడవాళ్ళ మీద జరుగుతున్న అత్యాచారాలకు వారు వేసుకునే దుస్థులకు సంబందం లేదని చాలా మంది హీరోయిన్లు చెప్తూనే ఉన్నారు. ఆ లిస్ట్ లో పూనమ్ కూడా చేరిపోయింది.



























