Poorna : శ్రీ మహాలక్ష్మి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన పూర్ణ, ఆ తరువాత అల్లరి నరేష్ సరసన నటించిన సీమ టపాకాయ్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ మళయాళి కుట్టి. అటు తెలుగు, తమిళ, మలయాళం లో సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక రవిబాబు అవును, లాంటి సినిమాలను చేసిన పూర్ణ ప్రస్తుతం ఈటీవీలో వస్తున్న ఢీ కి జడ్జి గా వ్యవహరిస్తూ మరింత ఫేమ్ తెచ్చుకుంది. తాజాగా పూర్ణ బాలకృష్ణ లెజెండ్ సినిమాలో నటించింది.

పెళ్లి పీఠలెక్కనున్న పూర్ణ….
ఎపుడు వ్యక్తిగత విషయాలు పెద్దగా చెప్పని పూర్ణ తాజాగా తన కాబోయే భర్త ఫోటో ను షేర్ చేస్తూ పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పింది. ఇది పెద్దలు కుదుర్చిన వివాహమో లేక ప్రేమా వివాహమో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఇపుడు చర్చంతా పూర్ణకి కాబోయే భర్త గురించి అతని బ్యాక్ గ్రౌండ్ గురించే. ఎందుకంటే పూర్ణకి కాబోయే భర్త అసిఫ్ అలీ ఓ బిజినెస్ మ్యాన్. అసిఫ్ అలీ కోట్ల రూపాయలకు అధిపతి అయిన జేబీఎస్ గ్రూప్ కంపెనీస్ ఫౌండర్, సీఈవో. ఇక ప్రస్తుతం నెట్టింట్లో షేర్ చేసిన ఫొటోలు ఎంగేజ్మెంట్ వేడుకకు సంబంధించినవి.
With the blessings of family stepping to my next part of life❤️???? and now it’s official ❤️ pic.twitter.com/v7Qo04t3Ws
— Purnaa (@shamna_kkasim) June 1, 2022
నా కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో నా జీవితంలో తరువాతి ఘట్టంలోకి అడుగుబెట్టబోతున్నా ఇట్స్ ఆఫీషియల్ అంటూ పోస్ట్ పెట్టింది పూర్ణ . ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇక పూర్ణ ప్రొఫెషనల్ గా ఈ ఇయర్ ఫుల్ బిజీగా ఉంది. చేతి నిండా సినిమాలతో కెరీర్ జోరుగా ఉంది. తెలుగు, తమిళ, మలయాళం లో 7 సినిమాలు చేస్తోంది. తెలుగులో నాకు నచ్చని పదం ప్రేమ, బ్యాక్ డోర్, తమిళ సినిమాలు పాదుమ్ పెసుమ్ , పిషాసు 2, అమ్మాయి, నెంజుకు నీతి షూటింగ్ పూర్తి చేసుకున్నాయి. ఇక మలయాళంలో వ్రిధం షూటింగ్ జరుపుకుంటోంది.



































