Pop singer Smitha : తెలుగులో తొలి పాప్ గాయనిగా తన కెరీర్ ప్రారంభించింది స్మిత. ఈటీవీ లో పాడుతా తీయగా ప్రోగ్రాం ద్వారా కెమరా ముందుకు వచ్చింది. 2000 సంవత్సరంలో పాప్ గాయనిగా ‘హై రబ్బా’ ఆల్బమ్ తో మంచి విజయాన్ని అందుకుంది. తరువాత వెను దిరిగి చూసుకునే పని లేకుండా వరుస విజయాలతో ముందుకు వెళ్ళింది. గాయని గానే కాకుండా మల్లీశ్వరి, ఆట సినిమాలలో నటించింది స్మిత. తెలుగు సినిమాలలో ప్లే బ్యాక్ సింగర్ గానే కాకుండా స్మిత వ్యాపార రంగంలో కూడా రాణిస్తోంది. అంతేకాకుండా గత కొన్ని సంవత్సరాలుగా ఇషా సంస్థలో వాలంటీర్ గా సేవలు అందిస్తోంది. మరోవైపు ఈ మధ్యనే ‘నిజం విత్ స్మిత’ అనే టాక్ షో తో సందడి చేస్తోంది.

నేను ఆయనను గౌరవిస్తాను…
స్మిత గారు తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేయడానికి గల కారణాలను వివరించారు. ఏ వ్యక్తి అయినా చేసిన మేలును మరువకూడదు. ఎవరూ 100% కరెక్ట్ గా ఉండరు. ఎంత గొప్ప పని చేసినా అది నచ్చని వాళ్ళు ఉంటారు. అయితే వాళ్ళు చేసిన మంచిని మనం గౌరవించాలి. అలా నేను సీబీఎన్ గారు చేసిన మంచి పనుల వల్ల ఆయనన్ని గౌరవిస్తాను.

ఇప్పుడు చూస్తున్న హైదరాబాద్ లో ఆయన చేసిన పనుల వల్లే ఇంత అభివృద్ధి చూస్తున్నాం. ఒక ఇరవై ఏళ్ల ముందే ఆయన ఆలోచించిన విధానం చాలా బాగుంది. ఒక విజనరీ లీడర్ ఆయన అంటూ చెప్పారు స్మిత. నేను రాజకీయాలు మాట్లాడటం లేదు, కేవలం ఒకరు చేసిన మంచి పనిని గౌరవించాలని మాత్రమే చెబుతున్నాను అంటూ చెప్పారు.