సాయం అంటే చాలు.. నేనున్నానంటూ బాలీవుడ్ నటుడు సోనూసూద్ ముందుకు వస్తున్నారు. లాక్‌డౌన్ సమయంలో ఎంతోమంది వలస కూలీలను, విద్యార్థులను ప్రత్యేక బస్సులు, రైళ్లు, ఫ్లైట్ల సాయంతో వారి స్వస్థలాలు చేర్చిన ఆయన.. ఇప్పటికే పేదలకు అండగా నిలుస్తున్నారు. అయితే తాజాగా సోనూ సూద్ పై ప్రముఖ నటుడు పోసాని సంచలన కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచారు.

వివరాల్లోకి వెళ్తే.. ఎప్పుడైనా ఏ విష‌యంపై అయినా త‌మ వివాక్చాతుర్యంతో వివాదాల‌కు తెర‌లేపే వ్య‌క్తులు కొంద‌రుంటారు. అలాంటి వారిలో పోసాని కృష్ణ‌ముర‌ళి ఒక‌రు. ఏదైనా అన్యాయం జ‌రిగితే దానిపై నోరు విప్పుతారు. అన‌ర్గ‌ళంగా మాట్లాడ‌తారు. త‌న మాట‌ల్లో నిజాయితీ క‌నిపిస్తుంది. కొన్ని విష‌యాలు త‌న‌కు సంబంధం లేక‌పోయినా అందులోని కొన్ని అంశాల‌తో వివాదాల‌కు తావిచ్చేలా మాట్లాడ‌తారు. తాజాగా అలాంటి చ‌ర్చే ఒక‌టి జ‌రిగింది. లాక్‌డౌన్ మొద‌లైన త‌ర్వాత బాలీవుడ్ న‌టుడు సోనూ సూద్ ఎంతో మందికి ఎన్నో విధాలా సాయం చేశాడు. దీంతో దేశ‌వ్యాప్తంగా ఆయ‌న పేరు మారుమోగిపోతోంది. అత‌ను ఎక్కువ‌గా విల‌న్ పాత్ర‌లే పోషించాడు. కానీ, నిజ‌జీవితంలో హీరో అనిపించుకున్నాడు.

సరిగ్గా ఇదే విష‌యం గురించి పోసాని ఓ టీవీ ఇంట‌ర్వూలో ప్ర‌స్తావించారు. “సోనూ సూద్ చేసే సహాయంలో గొప్పతనం ఏముంది.. చెప్పండి.? అలాంటి స‌హాయాలు తెలుగు హీరోలు ఎప్ప‌టి నుంచో చేస్తున్నారు. దేశంలో ఏ ఆపద సంభ‌వించినా వెంట‌నే స్పందించి కోట్లు విరాళాలుగా అందించారు. కానీ, ఇప్పుడు సోనూ సూద్ చేసుకుంటున్నంత ప్ర‌చారం తెలుగు హీరోలుగానీ, ఇత‌ర సినీ ప్ర‌ముఖులు గానీ చేసుకోలేదు. లాక్‌డౌన్ స‌మ‌యంలో నేను కూడా నాకు తోచినంత స‌హాయం చేశాను. కానీ, నేను చెప్పుకోలేదు. నా నుంచి స‌హాయం అందుకున్న‌వారికి అది తెలుస్తుంది. మ‌రి సోనూ ఇప్పుడు చేస్తున్న కార్య‌క్ర‌మాల‌న్నీ దేనికి చేస్తున్నాడో.. ప్ర‌జ‌లపై ప్రేమ‌తోనా లేక మ‌రేదైనా కార‌ణం ఉందా? అది ఆయ‌న‌కే తెలియాలి.

ఇలా అంద‌రికీ స‌హాయం చేస్తూ ప్ర‌చారం చేసుకున్నంత మాత్రాన సినిమాల్లో ఛాన్స్ లు రావు. సోనూ సూద్ అంటే ఈమ‌ధ్యే వ‌చ్చాడు. కానీ, మ‌న హీరోలు, నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు, ఇత‌ర ప్ర‌ముఖులు ఎప్ప‌టి నుంచో సినిమా రంగంలో ఉన్నారు. ఎంతో కాలంగా స‌హాయం చేస్తూ వ‌స్తున్నారు. వాటితో పోలిస్తే సోనూ చేస్తోంది ఎంత‌.? కానీ, సోనూని మాత్రం ఆకాశానికి ఎత్తేస్తున్నారు. రియల్ హీరో అంటూ జేజేలు ప‌లుకుతున్నారు. దానికి అంత బిల్డప్ ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉందా? సోనూ కంటే వెయ్యిరెట్లు బ్రాడ్ మైండెడ్ మ‌న తెలుగు ఇండ‌స్ట్రీ. ముందు ఆ విషయాన్ని అందరూ తెలుసుకోవాలి” అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here