Posani Krishna Murali : అల్లు అర్జున్ కి జాతీయ అవార్డు రావడం గురించి హాట్ కామెంట్స్ చేసిన పోసాని…!

0
45

Posani krishna murali: గంగోత్రి సినిమాతో ఇండస్ట్రీ కి వచ్చి నేడు పుష్ప, పుష్పరాజ్ తగ్గేదేలే అంటు ఏకంగా ఉత్తమ జాతీయ నటుడుగా అవార్డు సొంతం చేసుకున్నాడు బన్నీ. హీరోగా కమర్షియల్ సక్సెస్ లు ఎన్నో చుసిన నటన పరంగా కూడ ఉత్తమ జాతీయ నటుడిగా అవార్డు అందుకోవడంతో తెలుగు అభిమానులందరు సంతోషిస్తున్నారు. తాజాగా ప్రకటించిన జాతీయ చలన చిత్ర అవార్డులలో పుష్ప, త్రిపుల్ ఆర్ సినిమాలతో పాటు ఉప్పెన సినిమా కూడ అవార్డులను అందుకోవడం గర్వించతగ్గ విషయం. ఇక జాతీయ అవార్డుల ప్రకటన అనంతరం టాలీవుడ్ లో పలువురు ప్రముఖులు ముఖ్యంగా బన్నీ కి శుభాకాంక్షలు చెబుతున్నారు.

న్నీ అంటే చాలా ఇష్టం…. నెక్స్ట్ ఆస్కార్ కొడతాడు….

తాజాగా నటుడు, రచయిత, డైరెక్టర్ అలాగే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ చైర్మన్ గా ఉన్న పోసాని కృష్ణ మురళి గారు 69 జాతీయ అవార్డుల గురించి మాట్లాడారు. తెలుగు సినిమాలకు 11 అవార్డులు రావడం ఆనందంగా ఉందంటూ తెలిపారు. అలాగే అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డులు రావడం గురించి మాట్లాడుతూ బన్నీ అంటే నాకు చాలా ఇష్టం తనకి నేనేంటే చాలా ఇష్టం ఆ విషయం అతనికి తెలుసు.

ఒకసారి షూటింగ్ సమయంలో తనకి నేను చెప్పాను. నువ్వు యాక్టింగ్ నాకు వచ్చు అని కాకుండా నిరంతరం నీతో పనిచేస్తున్న వాళ్ళను చూస్తూ నేర్చుకుంటూనే ఉన్నావు. ఆ మంచి లక్షణం నీకు భవిష్యత్ లో మంచి నటుడుగా గుర్తింపు తెచ్చిపెడుతుంది అంటూ చెప్పాను నేడు అది నిజమైంది. బన్నీ ఇపుడు జాతీయ ఉత్తమ నటుడుగా అవార్డులు అందుకున్నాడు. భవిష్యత్ లో ఆస్కార్ కు అందుకుంటాడు అందులో ఆశ్చర్యం ఏమి లేదు అంటూ పోసాని అభిప్రాయపడ్డారు.