Prabhas @ 20 years : మూడు కన్నులున్న వాడు శివుడైతే, మూడు గుండెలు గల వీడు ఈశ్వర్ అంటూ సరిగ్గా ఇదే రోజు 2002 లో తొలి క్లాప్ తో హీరోగా తెలుగు తెరపై తన సంతకాన్ని పెట్టిన డార్లింగ్ ఇప్పటికి ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్ళు నిండాయి. ఈ ఇరవై ఏళ్లలో ఒక తెలుగు హీరో పాన్ ఇండియా సూపర్ హీరో అయ్యాడు. ఇక ఇపుడు హాలీవుడ్ వైపు చూస్తున్నాడు. ఇక తన నట ప్రస్థానం గురించి తన పెదనాన్న కృష్ణం రాజుగారి ఆనందానికి అవధులు లేవు.

20 ఏళ్ల కెరీర్లో 20 దేశాలలో అభిమానులను సంపాదించాడు…
ఇక పెదనాన్న కృష్ణం రాజు గారు ఈశ్వర్ సినిమా యూనిట్ తో కలిసి కేక్ కట్ చేసారు. ఇక అప్పటి జ్ఞాపకాలు నెమరువేసుకున్నారు. ఈశ్వర్ సినిమా ప్రారంభోత్సవం నాడు రామా నాయుడు స్టూడియోకి కొన్ని వేల మంది జనం రావడంతో వాళ్ళందరిని కంట్రోల్ చేయడం కష్టమైంది, ఇంకోసారి సినిమా ప్రారంభోత్సవానికి ఇవ్వను అని అన్నారట రామా నాయుడు గారు. ఇక సినిమాకు ప్రొడ్యూసర్ అశోక్ గారు ఆ సినిమాలో విలన్ గా నటించారు.

From Eeshwar clap from Uncle
— ???????????????????????? (@Becrazy181) June 28, 2022
To Project-K clap for Amitabh #Prabhas 20 Golden years in Cinema pic.twitter.com/5RKCjJgaCn
విలన్ గా ఆయన చాలా బాగా దిగజారి నటించారంటూ సరదాగా అన్నారు. ఇక ప్రభాస్ ఈశ్వర్ సినిమాతో మొదలుపెట్టి, వర్షం, డార్లింగ్ అంటూ ఛత్రపతి గా చరిత్ర సృష్టించి బాహుబలిగా బాలీవుడ్ లో కూడా క్రేజ్ సంపాదించాడు. ఇక ఇపుడు హాలీవుడ్ కి వెళ్ళబోతున్న మొదటి తెలుగు హీరో కాబోతున్నాడు. తాను ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు ప్రాజెక్ట్ కే, ఆది పురుష్ సినిమాల్లో నటిస్తున్నాడు. ఇక ఆదిపురుష్ సినిమా హాలీవుడ్ లో సైతం వస్తోంది. ఇక ఈ విషయాన్ని స్వయంగా కృష్ణం రాజు గారే చెప్పి ప్రభాస్ ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ తో ఇంత మంచి స్థాయికి రావడం చాలా గర్వంగా ఉంది అంటూ మాట్లాడారు.



























