Prabhas: టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా హీరోగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడంతో తదుపరి సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇకపోతే తాజాగా ప్రభాస్ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో నటించిన
ఆది పురుష్ సినిమా నుంచి టీజర్ విడుదల చేసిన విషయం మనకు తెలిసిందే.

అయోధ్యలో మేకర్స్ ఈ సినిమా టీజర్ ఈవెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇకపోతే ఈ టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కొందరు ఈ టీజర్ పై ప్రశంసలు కురిపించగా మరికొందరు మాత్రం ఏదో తెలియని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా టీజర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా ప్రభాస్ సినిమా గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ ఈ సినిమాలో నటించడానికి మొదట చాలా భయపడ్డానని ఇలా భయపడుతూనే మూడు రోజుల పాటు సినిమా షూటింగ్లో పాల్గొన్నానని ప్రభాస్ తెలిపారు.ఒక రాముడి పాత్రలో నటించాలంటే ఎంతో ఒదిగిపోయి భక్తి భావంలో లీనమైనటించాలి. ఇదివరకే ఇలా ఎన్నో రాముడు తరహా సినిమాలు వచ్చాయి. అలా తాను కూడా రాముడి పాత్రలో మెప్పించగలనా లేదా అని ప్రభాస్ ఈ సినిమా విషయంలో భయపడ్డానని చెప్పకనే చెప్పారు.

Prabhas: దూసుకుపోతున్న ఆది పురుష్ టీజర్…
ఇకపోతే ఈ సినిమాలో ఈయన రాముడి పాత్రలో అద్భుతంగా నటించారని కొందరు ఈ టీజర్ పై ప్రశంసలు కురిపించగా మరికొందరు మాత్రం ఈ టీజర్ విజువల్ ఎఫెక్ట్స్ పెద్దగా లేవంటూ విమర్శిస్తున్నారు. ఏదిఏమైనా ప్రభాస్ ఆది పురుష్ సినిమాపై అభిమానులు కూడా ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాలో కృతి సనన్ సీత పాత్రలో నటించారు.



























