Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉండే ప్రభాస్ సోషల్ మీడియాలో చాలా తక్కువగా సందడి చేస్తూ ఉంటారు. ఏదైనా సినిమాలు విడుదలైనప్పుడు వాటి గురించి స్పందిస్తూ రివ్యూ ఇవ్వడం వంటివి చేస్తూ ఉంటారు. అయితే తాజాగా ఈయన హీరో నాని నటించిన దసరా సినిమా గురించి తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.

ఈ సందర్భంగా దసరా సినిమా చూసిన తర్వాత ప్రభాస్ ఈ సినిమా పై తన అభిప్రాయాలను తెలియజేస్తూ చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.ఈ సందర్భంగా ప్రభాస్ స్పందిస్తూ ఇప్పుడే దసరా సినిమా చూసా చాలా అద్భుతంగా ఉంది నాకు బాగా నచ్చింది అంటూ తెలిపారు. ఇలాంటి అద్భుతమైన సినిమాలో నటించిన నానికి ఈయన శుభాకాంక్షలు తెలియజేశారు.
నాని కీర్తి సురేష్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఇతర చిత్ర బృందం పనికిరు ఎంతో అద్భుతంగా ఉందని మనం ఇలాంటి సినిమాలను మరిన్ని చేయాలి అంటూ ఈ సందర్భంగా ప్రభాస్ నాని దసరా సినిమా గురించి తన అభిప్రాయాలను తెలియజేస్తూ చేసినటువంటి ఈ పోస్ట్ వైరల్ గా మారింది అయితే దసరా సినిమాకు నాని మహేష్ బాబు వంటి హీరోలు మంచి రివ్యూ ఇవ్వడంతో ఈ సినిమాకు మరింత ప్లస్ పాయింట్ అవుతుంది.

Prabhasపాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్న నాని…
ఇక దసరా సినిమా ద్వారా ఇండస్ట్రీకి శ్రీకాంత్ ఓదెల అనే కొత్త డైరెక్టర్ పరిచయమయ్యారు. ఇలా నూతన దర్శకుడు దర్శకత్వంలో నాని కీర్తి సురేష్ జంటగా సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా అద్భుతమైన ఆదరణ పొందుతుంది. ప్రస్తుతం ఈ సినిమా అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్లను రాబడుతుంది. ఇక ఈ సినిమా మంచి హిట్ అవడంతో నాని కూడా పాన్ ఇండియా స్థాయిలో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు.



























