Prabhas: బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమం ఎంత ఆదరణ సంపాదించుకుందో మనకు తెలిసిందే.ఈ కార్యక్రమం మొదటి సీజన్ ఎంతో మంచి విజయం కావడంతో రెండవ సీజన్ కూడా అంతకుమించి ఉండేలా మేకర్స్ ప్లాన్ చేసారు. తాజాగా ఈ కార్యక్రమానికి పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ అతిథిగా వచ్చారు. ఇలా ప్రభాస్ ను ఈ టాక్ షోలో చూడటంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ ప్రభాస్ ను ఎన్నో ప్రశ్నలు వేసి ఆయన నుంచి సమాధానాలు రాబట్టారు.ముఖ్యంగా ప్రభాస్ పెళ్లి, హీరోయిన్లతో డేటింగ్ రూమర్ల గురించి కూడా ప్రభాస్ ను ప్రశ్నించారు. అయితే గత కొద్దిరోజులుగా ప్రభాస్ కృతి సనన్ ప్రేమలో ఉన్నారంటూ వీరి గురించి పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే బాలకృష్ణ ప్రభాస్ ను ప్రశ్నిస్తూ ఈ వార్తలలో నిజం ఎంత అని అడగడంతో ప్రభాస్ సైతం ఈ వార్తలపై స్పందించి క్లారిటీ ఇచ్చారు.
ఈ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ ఈ విషయం గురించి మేడం ఆల్రెడీ చెప్పేశారుగా.మా ఇద్దరి మధ్య అలాంటిదేమీ లేదు ఇది కేవలం పుకార్లు మాత్రమేనని ప్రభాస్ మరోసారి కృతి సనన్ తో డేటింగ్ గురించి క్లారిటీ ఇచ్చారు. అయితే ప్రభాస్ తనని మేడం అంటూ చెప్పడంతో బాలయ్య మేడం ఏంటి? అంత రొమాన్స్ ఏంటి? అని ప్రశ్నించారు.
నేను కూడా నా భార్య వసుంధరను ఇంట్లో మేడం అని పిలుస్తాను అంటూ మరోసారి బాలకృష్ణ ప్రభాస్ ను ఈ విషయంలో ఇరికించేశారు.ఏది ఏమైనా చాలా రోజుల తర్వాత ప్రభాస్ ఇలా ఒక టాక్ షోలో పాల్గొనడంతో అభిమానులు మాత్రం ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. అయితే ప్రభాస్ ఎపిసోడ్ మరొక భాగం కూడా త్వరలోనే ప్రసారం కారణంగా సంగతి తెలిసిందే.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…