Prabhas Seenu : పిల్లా నువ్వు లేని జీవితం, ఛత్రపతి, గబ్బర్ సింగ్, రామయ్యా వస్తావయ్యా వంటి సినిమాల్తో కమెడియన్ గా మంచి ఇమేజ్ తెచ్చుకున్న శ్రీనివాస్, ప్రభాస్ శీను గానే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘గబ్బర్ సింగ్’ లో తన నటనకు మంచి ప్రశంసలే కాకుండా అవకాశాలు కూడా వచ్చాయి. అయితే సరైన ప్లానింగ్ కెరీర్ మీద పెట్టకపోవడం వల్ల ఆర్థికంగా కూడా బాగా నష్టపోయిన ప్రభాస్ శీను తన కెరీర్ మొదట్లో అనుభవాలను, అవమానాలను తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడారు. తనతో నటించిన నటుల గురించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

చాలా మంది నిర్మాతలు రెమ్యూనరేషన్ ఎగ్గొట్టారు…
ప్రభాస్ శీను కమెడియన్ గా ఎన్నో సినిమాలలో చేస్తూ మంచి పేరు సంపాదించాడు. అయితే సంపాదించిన డబ్బు మాత్రం నిలబెట్టుకోలేకపోయాడట. కొన్నేళ్ల క్రితమే ఒక్కో సినిమాకు 5 లక్షలు అడ్వాన్స్ ఇచ్చేవారట. ఒకసారి ఒకేరోజు మూడు సినిమాలకు సంబంధిచిన అడ్వాన్స్ డబ్బు 15 లక్షలు వచ్చిందని అయితే ఆ డబ్బు లో 10 వేలు కూడా మిగలలేదంటూ శీను చెప్పాడు.

చేసిన అప్పులకు నా భార్య డబ్బువచ్చినపుడే మొదట అప్పులు తీర్చేయ్, వచ్చిన సినిమాలన్నీ చెయ్ అని చెప్పింది. ఇక నేను ఒక 400 సినిమాలలను చేసుంటే అందులో 100 సినిమాలకు రెమ్యూనరేషన్స్ ఎగ్గొట్టారు. ఇస్తామని అంటారు చివరకు ఎగ్గొడతారు అలా చాలా జరిగాయి. అవన్నీ సరిగా వచ్చి నేను సక్రమంగా ఉండిఉంటే బాగానే ఆస్తి ఉండేది అంటూ చెప్పాడు.






























