Prabhas : తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాదు ఇప్పుడు డార్లింగ్ కి ఇండియా మొత్తం అభిమానులు ఉన్నారు. ఆ కట్అవుట్ కి ఫిదా అయిపోయారు. హిట్స్ ప్లాప్స్ తో సంబందం లేకుండా ప్రభాస్ కి ఫ్యాన్స్ ఉన్నారు. బాహుబలి సినిమాతో వచ్చిన క్రేజ్ తో ఆ తరువాత వచ్చిన రెండు సినిమాలు ప్లాప్ అయినా కూడా డార్లింగ్ అంటే క్రేజ్ మాత్రం అలానే ఉంది. ఇక బయట ప్రేక్షకులు మాత్రమే కాదు ఇండస్ట్రీ లో కూడా ప్రభాస్ అంటే చాలా మందికి ఇష్టం. చాలా కామ్ గా, కూల్ గా ఉంటాడని తనకు కంప్లీమెంట్స్ ఇస్తారు. చాలా మంది హీరోయిన్స్ తనతో నటించడానికి ఇష్టపడుతారు. అలాంటి ప్రభాస్ ను ఒక హీరోయిన్ చాలా టార్చర్ చేసిందట.

ప్రభాస్ ను హేళనగా చూసిన బుట్ట బొమ్మ…
ఇంతకీ డార్లింగ్ ను అంతలా టార్చర్ చేసి ఇంకో సినిమా ఆమెతో చేయకూడదు అనేంతలా అనిపించిన హీరోయిన్ ఎవరో కాదు బుట్ట బొమ్మ పూజ హెగ్డే. ‘రాధే శ్యామ్’ సినిమాలో ఇద్దరు కలిసి నటించిన సమయంలో ప్రభాస్ ను చాలా హేళనగా చూసేదట. అది కాక షాట్ రెడీ అని చెప్పినా టైం కి రాకపోవడం, ప్రభాస్ తో షాట్ అయితే ఇంకొంచం లేట్ చేయడం చేసెదట. బాగా హెడ్ వెయిట్ చూపించి టార్చర్ చేసిందట పూజ హెగ్డే. ఇక సినిమా విడుదల సమయంలో ఈవెంట్స్ లో కూడా ఎడ మొఖం పెడ మొహంలా ఇద్దరు ఉన్నారు.

అప్పుడే అందరికి వీళ్ళ మీద అనుమానం వచ్చింది. ఇక రాధే శ్యామ్ తరువాత మరో సినిమా తనతో చేయనని ప్రభాస్ తన సన్నిహితులతో చెప్పాడట. ఇక ఫైనల్ గా ‘రాధే శ్యామ్’ సినిమా ప్లాప్ అవ్వడంతో ఇక ఆమెతో నటించనని చెప్పేసాడట తన సన్నిహితులకు. సాధారణంగా డార్లింగ్ తో నటించిన హీరోయిన్స్ ప్రభాస్ గురించి నెగెటవ్ గా మాట్లాడింది లేదు. చాలా బాగా ఉంటాడని, మంచి ఫుడ్ పెడతాడంటూ పొగుడుతూంటారు. అలాంటి ప్రభాస్ కే ఈ బుట్ట బొమ్మ చుక్కలు చూపించింది.

































