Prabhas : సెప్టెంబర్ 11 న కృష్ణం రాజు గారు పోస్ట్ కోవిడ్ సమస్యలతో మరణించడం అందరికీ తెలిసిందే. ఆయన అంత్యక్రియలు కూడా హైదరాబాద్ లోనే ప్రభుత్వ లాంచనాలతో జరిగాయి. ఇక ఆయన దశ దిన కర్మ ను ఈ నెల 23 న హైదరాబాద్ లోని నివాసంలో నిర్వహించాలని అనుకుంటున్నారు ప్రభాస్ ఫ్యామిలీ. ఇక ఆయన సంస్మరణ సభను మాత్రం కృష్ణం రాజు గారి సొంతూరు మొగల్తూరు లో నిర్వహించాలని అనుకుంటున్నారట. ఆ సభకు ప్రభాస్ ఫ్యామిలీ అంతా వస్తారని సమాచారం. దాదాపు 12 ఏళ్ల తరువాత ప్రభాస్ సొంతూరుకి పెదనాన్న వల్ల రాబోతున్నాడు.

70,000 మందికి భోజనాలు…
సెప్టెంబర్ 28 న కృష్ణం రాజు గారి సంస్మరణ సభ మొగల్తూరు లోని ఆయన నివాసం వద్ద జరపాలని అనుకుంటున్నారు. 2010 లో ప్రభాస్ తండ్రి కృష్ణం రాజు గారి తమ్ముడు మరణించినపుడు ప్రభాస్ మొగల్తూరు వెళ్లారు. ఆ తరువాత మళ్ళీ వెళ్ళలేదు. అయితే ఇప్పుడు పెదనాన్న కోసం 12 ఏళ్ల తరువాత వెళ్లాలని అనుకుంటున్నారు. ఇక ఈ సభ ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి.

వారి పూర్వికుల నివాసం వద్ద ఇంటికి రంగులు పూయించడం, ఫర్నిచర్ మార్చడం వంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక 70 వేల మందికి భోజనాలు పెట్టాలని అనుకోవడం వల్ల ద్రాక్షారామం నుండి వంటవాళ్ళను కూడా పిలిపించారు. కృష్ణం రాజు గారు బ్రతికి ఉన్నపుడు ప్రతి సంవత్సరం కనీసం రెండు సార్లైనా మొగల్తూరు వెళ్ళి వచ్చేవారట. కరోనా లాక్ డౌన్ వల్ల గత రెండేళ్లుగా ఆయన మొగల్తూరు వెళ్ళలేదు. ఈ నెల 23 న దశదిన కర్మ అనంతరం 28 న సంస్మరణసభ కుటుంబ సభ్యులందరి సమక్షంలో జరగనుంది.




























