Pragathi : హీరోయిన్ గా భాగ్యరాజ్ సినిమాతో తమిళ ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన ప్రగతి సొంతూరు ఒంగోలు. హీరోయిన్ గా రానించలేకపోయినా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రగతి తెలుగు, తమిళం, మలయాళం లో నటించింది. సినిమాల్లోనే కాకుండా టీవీ సీరియల్స్ తోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రగతి కరోనా మొదటి లాక్ డౌన్ సమయం నుండి రీల్స్ చేస్తూ తనలో ఉన్న కొత్త కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసింది. లాక్ డౌన్ సమయంలో డాన్స్ వీడియోలు పెడుతూ ట్రేండింగులో ఉండేది ప్రగతి. ఇక సినిమాల్లో ఎంతో హోమ్లీ లుక్ తో ఒక తల్లి పాత్రలో అత్త పాత్రలో కనిపించేది. కానీ సోషల్ మీడియాలో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా వర్క్ అవుట్ వీడియోలు, హాట్ డాన్సులతో రచ్చచేస్తోంది.

ఆ స్టార్ హీరో వల్ల క్యాస్టింగ్ కౌచ్ కి గురయ్నుయాను…
తన ఫిట్ నెస్ వీడియోలతో బాగా క్రేజ్ తెచ్చుకున్న ప్రగతి తాజాగా ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ షోలో కూడా మాస్ డాన్స్ తో ఇరగదీసింది. తన హాట్ డాన్స్ తో సోషల్ మీడియా ను షేక్ చేస్తోంది. అయితే సినిమాల్లో నటించే ప్రతి మహిళ తాము తొలినాళ్ళలో క్యాస్టింగ్ కౌచ్ ని ఎదుర్కొన్నామంటూ చెబుతుంటారు. వారి పేర్లు బయట పెట్టకపోయినా వాళ్ళు పడిన ఇబ్బందులను చెప్తుంటారు. ఇక ఈ జాబితాలోకి నటి ప్రగతి కూడా వచ్చేసింది. తొలినాళ్ళలో తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నట్లు చెప్పింది.

ఒక స్టార్ హీరో తనను ఒక రోజంతా తనతో గడపమని అడిగినట్లు చెప్పి బాంబు పేల్చింది. అలాచేస్తే అవకాశాలు బాగా వస్తాయంటూ ఆఫర్ చేసాడట. అయితే ఆ స్టార్ హీరో ఎవరనేది మాత్రం బయటపెట్టలేదు ప్రగతి. ఇటీవల f3 సినిమాలో మంచి కామెడీ పండించిన ప్రగతి అటు బుల్లి తెర మీద ఇటు వెండితెర మీద ఇక సోషల్ మీడియాలోనూ బాగా రచ్చ చేస్తోంది. సోషల్ మీడియాలో ప్రగతి హీరోయిన్లకు ఏమాత్రం తీసి పోకుండా చేసే వర్కౌట్లకు, డాన్స్లకు బాగానే కుర్రకారు ఫిదా అవుతోంది. ప్రగతి కి సోషల్ మీడియాలో లక్షల్లో ఫాలోయర్స్ ఉన్నారు మరి.
































