Prathyusha mother Sarojini Devi : మోహన్ బాబు చెప్పు తీసుకుని కొడతానని అన్నా పడతాను… కానీ ప్రెస్ మీట్ పెట్టి నా ముఖం చూడను అని తిట్టారు…: ప్రత్యుష తల్లి సరోజినీ దేవి

0
461

Prathyusha mother Sarojini Devi : చిన్న పాత్రతో సినిమాల్లోకి అడుగుపెట్టిన తెలుగమ్మాయి ప్రత్యూష అనతి కాలంలోనే మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. కలుసుకోవాలని, స్నేహమంటే ఇదేరా వంటి సినిమాల్లో నటించిన ప్రత్యూష తమిళం వంటి ఇతర భాషల్లోనూ హీరోయిన్ గా అవకాశాలు అందుకుని కెరీర్ లో ముందుకు అడుగులేస్తున్న సమయంలో అర్థాంతరంగా మరణించింది. అనుమానాస్పదంగా ప్రత్యూష మరణిస్తే ఆమె తల్లి సరోజినీ దేవి ఆమెకు న్యాయం జరగాలని ఇప్పటికీ పోరాడుతున్నారు. ఎన్నోసార్లు కేసులో వెనక్కి తగ్గాలని భయపెడుతూ ఫోన్స్ వచ్చాయంటూ చెప్పిన సరోజినీ గారు, కానీ ఎక్కడా పోరాటం ఆపలేదంటూ చెప్పారు. కానీ కూతురు చనిపోయి ఇరవై ఏళ్ళు దాటిపోయినా న్యాయం మాత్రం జరగలేదని బాధపడ్డారు.

మోహన్ బాబు ముఖం చూడనన్నారు…

ప్రత్యుష మరణంకి సంబంధించి న్యాయం కోసం ఆమె తల్లి సరోజినీ ఇప్పటికీ పోరాడుతున్నా న్యాయం మాత్రం ఆమెకు జరగలేదు. ఇక హీరోయిన్ గా కెరీర్ లో సక్సెస్ చూస్తున్న టైములో ప్రత్యుష కి ఇలా జరిగినపుడు సినిమా ఇండస్ట్రీ నుండి ఎటువంటి సహాయం రాలేదని సరోజినీ దేవి గారు తెలిపారు. అందరూ చనిపోయినపుడు స్టేట్మెంట్స్ ఇచ్చారు కానీ పోరాటంలో ఎవరూ ముందుకు రాలేదని తెలిపారు. మోహన్ బాబు గారు ప్రెస్ మీట్ పెట్టి నన్ను తిట్టారు.

ఆ అమ్మాయి టాలెంట్ ను ఎలివేట్ చేసి నీ చేతిలో పెడితే ఒక మాణిక్యాన్ని నువ్వు పోగొట్టుకున్నావు అని తిట్టారు, నీ మొహం ఇక చూడనని అన్నారు. మోహన్ బాబు గారు తిట్టాడానికి ఆయనకు హక్కు ఉంది, చెప్పుతో కొట్టినా పడతాను కానీ నేను చేయని తప్పుకు నాకు శిక్ష పడింది. ప్రేమించానని చెప్పి నమ్మించి ప్రత్యుష ను వాడు మోసం చేసాడు. ఒక ప్రేమించినవాడు తన స్నేహితలతో కలిసి అత్యాచారం చేస్తాడా?? ఇలా కూడా ఉంటారని అపుడే తెలిసింది అంటూ బాధపడ్డారు.