Preethi Suicide Issue : ర్యాంగింగ్ వల్ల ఆత్మహత్య చేసుకున్న వరంగల్ పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఐదు రోజులు మృత్యువుతో పోరాడి చివరకు మరణించింది. ఆమె కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సెకండ్ ఇయర్ విద్యార్థి సైఫ్ రిమాండ్ రిపోర్ట్ ను పోలీసులు మీడియా ముందు పెట్టారు. అందులో వాట్సాప్ చాట్ లో ప్రీతిని హేళనగ మాట్లాడినట్లు ప్రీతి విషయంలో జరిగిన అవమానాలు గురించి విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.

కులం పేరుతో అవమానం…
ప్రీతి గత నవంబర్ లో కాకతీయ యూనివర్సిటీ లో పీజీ చేరగా సైఫ్ కింద టీంలో కొనసాగింది. ఒక ఆక్సిడెంట్ కేసులో రిపోర్ట్ ను ప్రీతి రాయగా అది సరిగా రాయలేదని సైఫ్ అందరి ముందు ఆమెను అవమానించాడు. రిజర్వేషన్ లో సీటు వచ్చిందంటూ హేళన చేయడంతో ప్రీతి నీలదీసింది. ప్రీతి నిలదీయడం నచ్చని సైఫ్ ఆమెకు ఎక్కువగా నైట్ డ్యూటీలను ఇవ్వమని మిగిలిన సీనియర్స్ కి కూడా చెప్పి ప్రెషర్ చేసారు.

ఇక వాట్సాప్ లో ఆమె రాసిన రిపోర్ట్స్ పెట్టి అందరిలోనూ హేళన చేయడంతో సైఫ్ మీద ఫిర్యాదు కూడా చేసింది ప్రీతి. అయితే హెచ్ఓడి నాగార్జున రెడ్డి ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు. ఆ మరుసటి రోజే ప్రీతి ఇలా ఆత్మహత్య చేసుకోడానికి హానికర ఇంజక్షన్ తీసుకుంది.



























