ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోల సరసన మెరిసిన హీరోయిన్… ఇప్పుడు కార్పొరేట్ ప్రపంచంలో టాప్ పొజిషన్‌లో దూసుకెళ్తోంది. వరుస ఫ్లాపుల తర్వాత సినిమా ఇండస్ట్రీకి దూరమైన ఈ బ్యూటీ, ప్రస్తుతం యూకేకు చెందిన గేమింగ్ కంపెనీలో డైరెక్టర్‌గా పనిచేస్తోందన్న వార్త హాట్ టాపిక్‌గా మారింది.
ఆమె మరెవరో కాదు… Deeksha Seth.

మోడల్ నుంచి హీరోయిన్ వరకు
ఫెమినా మిస్ ఇండియా పోటీలో టాప్ టెన్‌లో నిలిచి ‘ఫ్రెష్ ఫేస్’ టైటిల్ గెలుచుకున్న దీక్షా సేథ్, తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టింది. మొదటి సినిమానే Allu Arjun సరసన చేసింది. ఆ చిత్రం Vedam మంచి విజయాన్ని అందుకోవడంతో ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి.
ఆ తర్వాత Ravi Teja తో మిరపకాయ్, Gopichand తో వాంటెడ్, Manchu Manoj తో ఊ కొడతారా ఉలిక్కి పడతారా వంటి సినిమాల్లో నటించింది. అలాగే Prabhas, Vikram, Darshan లాంటి స్టార్ హీరోల సరసన కూడా కనిపించింది.
ఫ్లాపుల ప్రభావం
అయితే వరుసగా వచ్చిన సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో అవకాశాలు తగ్గాయి. 2021లో చివరిసారిగా సిల్వర్ స్క్రీన్‌పై కనిపించిన దీక్షా, ఆ తర్వాత పూర్తిగా ఇండస్ట్రీకి గుడ్‌బై చెప్పింది.
కార్పొరేట్ ప్రపంచంలో కొత్త అడుగు
సినిమాలను వదిలిన తర్వాత దీక్షా తన విద్యపై దృష్టి పెట్టింది. IESE Business School నుంచి ఎంబీఏ పూర్తి చేసింది. ప్రస్తుతం యూకేకు చెందిన గేమింగ్ కంపెనీలో Director – Business Development & Strategic Partnershipsగా పనిచేస్తోంది.
లింక్డ్‌ఇన్‌లో కూడా తన కెరీర్ మార్పును “deliberate shift”గా పేర్కొంది. ఒకప్పుడు గ్లామర్ ప్రపంచంలో మెరిసిన ఆమె, ఇప్పుడు కార్పొరేట్ స్ట్రాటజీలతో కొత్త గుర్తింపు సంపాదిస్తోంది.
నెట్టింట వైరల్
దీక్షా సేథ్ తాజా ఫొటోలు, ప్రొఫైల్ అప్‌డేట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. “టాలీవుడ్ నుంచి బిజినెస్ వరకూ సక్సెస్‌ఫుల్ ట్రాన్స్‌ఫర్మేషన్” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.



























