General News

కరోనాను ఆపేందుకు వేప తులసి ఆకులతో మాస్క్.. కానీ చివరికి?

దేశంలో వ్యాపిస్తున్న కరోనా వైరస్ కు అడ్డుకట్ట వేయాలంటే మన ముందున్న ఒకే ఒక మార్గం మాస్కులు ధరిస్తూ కరోనా జాగ్రత్తలు పాటించడం. ప్రస్తుతం కరోనా రెండవ దశ తీవ్ర రూపం దాల్చడంతో ఇంటికే పరిమితం కావాలని అవసరమైతే తప్ప బయటకు వెళ్లాలని, బయటకు వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరూ డబల్ మాస్కులు ధరించి వెళ్లాలనే అధికారులు సూచిస్తున్నారు.ఈ విధంగా మాస్కు ధరించి సామాజిక దూరం పాటించడం వల్ల కరోనా వైరస్ కి అడ్డుకట్ట వేయవచ్చని అధికారులు తెలియజేస్తున్నారు.

ఇదిలా ఉండగా ఓ సాధువు మాత్రం ప్రకృతిసిద్ధమైన మాస్కును తయారు చేసుకొని ధరించారు. జనపనార తో తయారు చేసిన ఆ మాస్క్ కి వేపాకులు, తులసి ఆకులతో నింపాడు.ఐపీఎస్ అధికారి రుపిన్ శర్మ ట్వీట్ చేసిన ఈ సాధువు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను పోస్ట్ చేసిన ఐపీఎస్ అధికారి ఈ మాస్క్ పనిచేస్తుందన్న గ్యారెంటీ లేదు అంటూ క్యాప్షన్ ఇచ్చారు.

ఉత్తరప్రదేశ్ కి చెందిన సాధువు వీడియో తీసిన వ్యక్తి తో మాట్లాడుతూ.. ఈ మాస్క్ ను తులసి, వేప ఆకులతో తయారు చేశానని, తులసి, వేపలోఎన్నో ఔషధగుణాలు దాగి ఉన్నాయి. ఇవి ఎలాంటి రోగానైన నయం చేయ గలవని తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియోలో సాధువు ధరించిన మాదిరిగా ఎవరూ కూడా మాస్కు ధరించి వద్దని, ఈ మాస్క్ వైరస్ ను కట్టడి చేయలేవు. కనుక ప్రతి ఒక్కరు బయటకు వెళ్ళినప్పుడు ఎన్-95, క్లాత్ మాస్క్ లేదా సర్జికల్ మాస్క్ ధరించి బయటకు వెళ్లాలని, వీలైనంత వరకు భౌతిక దూరం పాటిస్తూ తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని అధికారులు తెలియజేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago