దేశంలో వ్యాపిస్తున్న కరోనా వైరస్ కు అడ్డుకట్ట వేయాలంటే మన ముందున్న ఒకే ఒక మార్గం మాస్కులు ధరిస్తూ కరోనా జాగ్రత్తలు పాటించడం. ప్రస్తుతం కరోనా రెండవ దశ తీవ్ర రూపం దాల్చడంతో ఇంటికే పరిమితం కావాలని అవసరమైతే తప్ప బయటకు వెళ్లాలని, బయటకు వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరూ డబల్ మాస్కులు ధరించి వెళ్లాలనే అధికారులు సూచిస్తున్నారు.ఈ విధంగా మాస్కు ధరించి సామాజిక దూరం పాటించడం వల్ల కరోనా వైరస్ కి అడ్డుకట్ట వేయవచ్చని అధికారులు తెలియజేస్తున్నారు.

ఇదిలా ఉండగా ఓ సాధువు మాత్రం ప్రకృతిసిద్ధమైన మాస్కును తయారు చేసుకొని ధరించారు. జనపనార తో తయారు చేసిన ఆ మాస్క్ కి వేపాకులు, తులసి ఆకులతో నింపాడు.ఐపీఎస్ అధికారి రుపిన్ శర్మ ట్వీట్ చేసిన ఈ సాధువు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను పోస్ట్ చేసిన ఐపీఎస్ అధికారి ఈ మాస్క్ పనిచేస్తుందన్న గ్యారెంటీ లేదు అంటూ క్యాప్షన్ ఇచ్చారు.
ఉత్తరప్రదేశ్ కి చెందిన సాధువు వీడియో తీసిన వ్యక్తి తో మాట్లాడుతూ.. ఈ మాస్క్ ను తులసి, వేప ఆకులతో తయారు చేశానని, తులసి, వేపలోఎన్నో ఔషధగుణాలు దాగి ఉన్నాయి. ఇవి ఎలాంటి రోగానైన నయం చేయ గలవని తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ వీడియోలో సాధువు ధరించిన మాదిరిగా ఎవరూ కూడా మాస్కు ధరించి వద్దని, ఈ మాస్క్ వైరస్ ను కట్టడి చేయలేవు. కనుక ప్రతి ఒక్కరు బయటకు వెళ్ళినప్పుడు ఎన్-95, క్లాత్ మాస్క్ లేదా సర్జికల్ మాస్క్ ధరించి బయటకు వెళ్లాలని, వీలైనంత వరకు భౌతిక దూరం పాటిస్తూ తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని అధికారులు తెలియజేస్తున్నారు.
































