ప్రధాన మంత్రి, రాష్ట్రపతి వంటి వారికి స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ ఉంటుంది. వారి రక్షణ ఖర్చే కోట్లలో ఉంటుంది. అస్సలు ఆ ఫోర్స్ ఏమిటి, వారి చేతిలో ఉండే బ్రీఫ్ కేస్ లో ఏముంటుంది అని చాలా మందికి తెలుసుకోవాలని ఉంటుంది. ఎక్కువ మంది దానిలో ఏవో డాక్యుమెంట్స్ ఉంటాయి అనుకుంటారు. ఇంతకీ దానిలో ఏముందో తెలుసుకుందాం.

ఎస్పీజీ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కి రక్షణ కల్పిస్తుంది. ప్రధాని ఏదైనా ప్రదేశానికి సందర్శించడానికి ముందు ఒక టీమ్ అక్కడ తనిఖీలు చేసి క్లియరెన్స్ ఇచ్చాకే మరొక ఎస్పిజి ఫోర్స్ ప్రధాని వెంట ఉండటం జరుగుతుంది. ప్రధాని దేశం లోనే కాకుండా ఇతర దేశాల్లో పర్యటించాలటే ఈ కమాండ్ ల టీమ్ ఉండాల్సిందే. ప్రధాని మోడీ రక్షణ కోసం రోజుకు 1.62 కోట్లు ఖర్చు అవుతుంది అని, అత్యధిక మొత్తం రక్షణ కోసం పెడుతున్నారు అని ప్రసార మాధ్యమాలు ఈ వార్తను ఎక్కువగా చెప్పడం వినిపిస్తుంది.

ఇంతకు ప్రధాని పక్కన సెక్యూరిటీ ఆఫిసర్ చేతిలో ఉండే బ్రీఫ్ కేస్ లో ఏముంటుంది అంటే… దానిలో ఒక బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఉంటుంది. ఇది ప్రధాని పక్కన కొన్ని అడుగుల దూరంలోనే ఉంటుంది. అయితే దీనిలో డాక్యుమెంట్స్ లేదా ఏమైనా ఫైల్స్ ఉంటాయి అనుకుంటారు చాలా మంది. కానీ దానిలో ఉండేది ప్రధానికి రక్షణ కల్పించే రక్షణ కవచం అని తెలియకపోవచ్చు.

ఈ బ్రీఫ్ కేస్ జెడ్ మరియు జెడ్ ప్లస్ సెక్యరిటీ కల్పించ బడే ఏ వీఐపీకి అయిన ఇటువంటి బ్రీఫ్ కేస్ నీ మనం చూడడం జరుగుతుంది. ఏదైనా ప్రమాదం జరిగినపుడు, లేదా ప్రమాదం జరిగే అనుమానాలు ఉన్నపుడు ఈ బ్రీఫ్ కేస్ లోని షీల్డ్ నీ ఓపెన్ చేస్తారు ఎస్పీ జీ టీమ్. ఇది సదరు వీఐపి లేదా వీవిఐపికి తక్షణ మరియు తాత్కాలిక రక్షణ కల్పించడంలో ఉపయోగపడుతుంది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here