Priyanka Chopra : 2000 సంవత్సరంలో ప్రపంచ సుందరిగా నిలిచిన డస్కీ బ్యూటీ ప్రియాంక చోప్రా ఆ తరువాత సినిమాల్లోకి అడుగుపెట్టింది. బాలీవుడ్ లో గ్లామర్ పాత్రలతో పాటు యాక్షన్ ఓరియెంటెడ్ ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలలోనూ అలరించింది. ఇక కథా ప్రాధాన్యమున్న పాత్రాలలోనూ మెప్పించిన ప్రియాంక ఫ్యాషన సినిమాలో ఒక మోడల్ పడే కష్టాలను, సవాళ్లను బాగా చూపించింది. మెరికోమ్ లాంటి నిజ జీవితం ఆధారంగా తీసిన సినిమాలోనూ ఒదిగిపోయి బాక్సర్ గా తన నటనతో అందరిని ఫిదా చేసింది. ఇక క్వాంటికో సిరీస్ తో హాలీవుడ్ లో అడుగుపెట్టిన ప్రియాంక బాలీవుడ్ సినిమాలు తగ్గించి హాలీవుడ్ లో సెటిల్ అయింది.

హాలీవుడ్ స్టైల్ లోనే ప్రియాంక హొయలు….
ఇక హాలీవుడ్ క్వాంటికో సిరీస్ తో మంచి పేరు రావడంతో అక్కడే ఇల్లు తీసుకుని సెటిల్ అయింది. ఇక బేవాచ్, ఏ కిడ్ లైక్ జేక్, ఈజ్ నాట్ ఇట్ రొమాంటిక్, వియ్ కెన్ బీ హీరోస్, ది మ్యాట్రిక్స్ రెజ్యూరెక్షన్ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె ఇట్స్ ఆల్ కమింగ్ బ్యాక్ టూ మీ చిత్రంలో నటిస్తుంది. యాక్షన్ డ్రామాస్ లో ప్రియాంక అదరగోడుతోంది. తన కన్నా చిన్నవాడైనా హాలీవుడ్ పాప్ సింగర్ నిక్ జోన్స్ ను పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయింది. ఈ మధ్యనే సరోగసీ ద్వారా ఆడపిల్లకు తల్లిదండ్రులయ్యారు ప్రియాంక, నిక్ దంపతులు. ప్రియాంక ఇపుడు గ్లోబల్ బ్యూటీ స్టేటస్ ను ఎంజాయ్ చేస్తోంది. వీలు దొరికినప్పుడల్లా అందాల ఆరబోతతో పిచ్చెక్కిస్తోంది. పొదుపు బట్టలతో తన అందాల విందుచేస్తోంది హాలీవుడ్ మోడల్ కల్చర్ ను బాగా వంటబట్టించుకున్న ప్రియాంక ఇక హాలీవుడ్ రేంజ్ లో అందాలు చూపిస్తే ఇక ఆమె అభిమానుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

ఏ మాత్రం దాచుకోకుండా అందాల ఆరాబోత….

అవార్డు ఫంక్షన్స్, ఫ్యాషన పేజెంట్స్ వంటి వాటిలో ప్రియాంక ఏమాత్రం మొహమాట పడకుండా ఏమాత్రం దాచుకోకుండా అందాలను చూపిస్తూ ఉంటుంది. ఇపుడు ఒక ఇంటర్నేషనల్ నగల బ్రాండుకి ప్రచారకర్త గా ఉన్న ప్రియాంక హాట్ ఫోటో షూట్ తో కుర్రకారుకి నిద్ర లేకుండా చేస్తోంది. బ్రా లెస్ డార్క్ గోల్డెన్ కలర్ డ్రెస్ లో ట్రెండీ గా ఉన్న ప్రియాంక ఎద అందాలను చూపించీ చూపించనట్టుగా చూపించి ఊరించింది. ప్రియాంక తో పాటు మరో నటి అన్నా హత్వె, కొరియన్ పాప్ సింగర్ బ్లాక్ పింక్ లీసా కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. వారితో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ మేమంతా అమ్మాయిలం ఇలా ఎంజాయ్ చేస్తున్నాం అంటూ కాప్షన్ ఇచ్చింది ప్రియాంక.



































